Manchu Family: మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య గొడవ రచ్చకెక్కింది. గత కొన్నేళ్ళుగా మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు ఉన్నాయనే మాట టాలీవుడ్ సర్కిల్ లో ఉంది. వీరిద్దరూ కలిసి మాట్లాడుకోవడం కూడా లేదని టాక్. అయితే ఈ గొడవల విషయం ఇప్పటి వరకు నాలుగు గోడల మధ్యనే రచ్చ నడిచింది. వారి మధ్య వైరం ఎందుకు వచ్చింది అని పక్కన పెడితే ఇప్పుడు వారి మధ్య ఈ గొడవ తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం మంచు మనోజ్ పెళ్లి వేడుకలో విష్ణు అలా చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోయారు.
ఇక అన్నదమ్ముల మధ్య గొడవని సద్దుమనిగించే ప్రయత్నం మంచు లక్ష్మి చేస్తుంది. అయితే ఇప్పుడు ఏకంగా మంచు మనోజ్ పేస్ బుక్ స్టేటస్ లో ఒక వీడియో పెట్టారు. దాంట్లో మంచు విష్ణు ఓ ఇంట్లోకి వచ్చి ఎవరితోనో గొడవ పడుతున్నాడు. దాంట్లో మంచు వాయిస్ లో మాట్లాడుతూ ఇలా ఇళ్ళల్లోకి వచ్చి కుటుంబ సభ్యులని కొడుతూ ఉంటాడు. రెగ్యులర్ గా ఇలా వచ్చి కొడుతూ ఉంటాడు అని మనోజ్ చెప్పాడు. పేస్ బుక్ లో పెట్టిన కొద్ది సేపటికే ఈ వీడియో వైరల్ గా మారింది.
దీంతో అసలు మంచు విష్ణు, మనోజ్ మధ్య ఏం జరిగింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మంచు విష్ణు, మనోజ్ మధ్య గొడవలు ఈ వీడియోతో తారాస్థాయికి వెళ్లాయనే మాట వినిపిస్తుంది. ఇక మనోజ్ ఈ ఘటనపై పోలీసులకి ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతూ ఉండగా మంచు మోహన్ బాబు కలుగజేసుకొని ఇద్దరిపై సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో మంచు మంనోజ్ వెనక్కి తగ్గాడు అనే మాట వినిపిస్తుంది. ఇక ఈ వీడియో వివాదంపై మంచు మనోజ్, విష్ణుతో కలిసి మోహన్ బాబు మీడియా ముందుకి వచ్చి క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.