Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా “మన శంకరవరప్రసాద్ గారు”. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సినిమా నుంచి మొదటి లిరికల్ వీడియో సాంగ్ ‘మీసాల పిల్ల’ రిలీజై యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. చిరంజీవి అంటే డాన్స్ కి పెట్టింది పేరు. ఆయనతో ఏ దర్శకుడు సినిమా చేసినా ముందు పాటలు ఎలా ఉండాలి..ఎలాంటి సందర్భంలో రావాలి..ఏ పాటను ఏ డాన్స్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయాలి..? లాంటి లెక్కలు ముందే వేసుకుంటారు.
చిరంజీవి సినిమాలో ఏ ఎలిమెంట్ మిస్ అయినా మెగా ఫ్యాన్స్ హర్ట్ అవడం ఖాయం. ఇక, ఆయన పక్కన హీరోయిన్ లేకపోయినా..డాన్స్ లేకపోయినా మెగా అభిమానులు అల్లాడిపోతారు. వాళ్ళవరకూ ఎందుకు, సినిమాలో సాంగ్స్ లేకపోతే చిరు మనసే చివుక్కుమంటుంది. అందుకే, మెగాస్టార్ సినిమా ఫుల్ మీల్స్ లా ఉంటుంది. ఇక, తాజాగా ఆయన నటిస్తున్న “మన శంకరవరప్రసాద్ గారు” సినిమా నుంచి ‘మీసాల పిల్ల’.. అంటూ సాగే స్లో మెలోడీ సాంగ్ ఒకటి ఫస్ట్ సింగిల్ గా మేకర్స్ వదిలారు.
చాలా ఏళ్ళ తర్వాత ఉదిత్ నారాయణ్ ఈ పాటతో మళ్ళీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో, మెగాస్టార్ నటించిన ‘చూడాలి ఉంది’ సినిమాలో ‘రామ్మా చిలకమ్మా’ పాట పాడి టాలీవుడ్ లో సింగర్ గా ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో ఆ క్రెడిట్ దర్శకుడు గుణశేఖర్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మలకి దక్కింది. తెలుగులో ఏ హీరోకి ఉదిత్ పాట పాడినా, ఆ సాంగ్ సూపర్ హిట్ అంతే. ఇక, మెగాస్టార్ కి పాడిన ప్రతీపాట బ్లాక్ బస్టర్. అందుకే, ఇప్పుడు అనిల్ రావిపూడి “మన శంకరవరప్రసాద్ గారు” సినిమా కోసం మళ్ళీ తీసుకొచ్చారు.
గ్యారెంటీగా ఈ సాంగ్ కి థియేటర్స్ లో మెగా ఫ్యాన్స్ లేచి డాన్స్ చేస్తారు..అనేలా ఉంది. ‘ఇంద్ర’ సినిమాలో ‘రాధే గోవందా’.. సాంగ్ ఎలా అయితే స్లో పాయిజన్ లా ఎక్కిందో, ఇప్పుడు “మన శంకరవరప్రసాద్ గారు” సినిమాలోని ‘మీసాల పిల్ల’ సాంగ్ కూడా అలాగే ఎక్కేస్తుందనడంలో సందేహం లేదు. భార్యభర్తల మధ్య ‘అలక’ దూరినప్పుడు వచ్చే సందర్భం అని క్లియర్ గా అర్థమవుతుంది. ఈ పాటకి, భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్, ఉదిత్ నారాయణ – శ్వేతా మోహన్ వాయిస్, భాస్కర భట్ల అందించిన సాహిత్యం..మధ్యలో అనిల్ రావిపూడి స్టైల్ ఆఫ్ మేకింగ్..ఇలా అన్నీ పర్ఫెక్ట్ గా సూటయ్యాయి. ఇక సంక్రాంతికి థియేటర్స్ లో పూనకాలు రావడమే ఆలస్యం. కాగా, ఈ సినిమాను సాహు గారపాటి, సుష్మిత కొణిదెల కలిసి నిర్మిస్తున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.