Malaika Arora : ఈ మధ్యకాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. కొంత మంది ఫేమ్ కోసం ఈ వేదికను వాడుకుంటుంటే కొంతమంది తమ అభిప్రాయాలను చెప్పేందుకు ఉపయోగిస్తున్నారు. ఇక సెలబ్రిటీలు అయితే తమ ఫాలోయింగ్ ను పెంచుకోవడంతో పాటు చాలా విషయాలపై ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. తమ పిల్లలకు కూడా అదే నేర్పుతారు. కొన్నిసార్లు కాంట్రవర్సీ కామెంట్స్ చేసి విమర్శలపాలవుతున్నారు. లేటెస్టుగా బాలీవుడ్ నటి , ఐటమ్ బాంబ్ మలైకా అరోరాను ఇప్పుడు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఐటమ్ పాటలకు పెట్టింది పేరు మలైకా అరోరా. ఇక బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం మూవీస్ కి బ్రేక్ ఇచ్చి ఓ టెలివిజన్ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది.
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ జిమ్ అవుట్‌ఫిట్స్ లో కనిపిస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. వర్క్ లో ఎంత బిజీగా ఉన్నా నెట్టింట్లో మాత్రం మలైకా చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే మలైకా తన కొడుకు అర్హాన్ ఖాన్ ను ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో తన కొడుకును రకరకాల క్వశ్చన్స్ అడిగింది. ఓ తల్లి కొడుకును అడగకూడని ప్రశ్న కూడా మలైకా అడగడంతో నెటిజన్స్ షాక్ అయ్యారు. దీంతో ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
మలైకా అరోరా ఈ ఇంటర్వ్యూలో తన కొడుకును వర్జినిటీ గురించి ఓ క్వశ్చన్ అడిగింది. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. “అర్హాన్ నువ్వు వర్జినిటీని ఎప్పుడు కోల్పోయావు అని ప్రశ్నించగా అర్హాన్ ‘వావ్’అంటూ ఓ నవ్వు నవ్వేశాడు. అంతే దానికి మించి వీడియోలో లేదు. దీనిని బట్టి ఇది షో టీజర్ అని అనిపిస్తోంది. ఫుల్ వీడియో రిలీజైన తర్వాత అర్హాన్ సమాధానం తెలుస్తుంది.ఇక అర్హాన్ కూడా ” అమ్మ నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని తన అమ్మను ఓ ప్రశ్న అడిగాడు. మలైకా కూడా ఓ నవ్వు నవ్వేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇక మలైకా, బాలీవుడ్ యువ హీరో, బోనీకపూర్ కొడుకు అర్జున్ కపూర్ డేటింగ్ చేస్తున్న విషయం తెలిసింది. బాలీవుడ్ లో వీరిద్దరికి సంబంధించిన న్యూస్ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నవీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మలైకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.