Mahesh Babu : మహేష్ బాబు ఆ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి. లేటెస్ట్గా సంక్రాంతి సందర్భంగా విడుదలైన గుంటూరు కారం మూవీలో మాస్ కటౌట్తో మెస్మరైజ్ చేశాడు సూపర్ స్టార్. ఇదివరకు ఎన్నడూ కనిపించనంతగా న్యూ లుక్ లో కనిపించి తన ఫ్యాన్స్ హృదయాలను దోచేశాడు. గుంటూరు యాసలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ గూస్ బంమ్స్ తెప్పించాయి. ఇక ఎనర్జిటిక్ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఇరగదీశాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో జనవరి 12న రిలీజైన గుంటూరు కారంకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చింది. ఈ మూవీలో మహేష్ కు జోడీగా టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ నటి శ్రీలీల కనిపించింది. మహేష్ తల్లిగా రమ్యకృష్ణ, తాతగా ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించారు. తల్లి సెంటిమెంట్ తో వచ్చిన గుంటూరు కారంకు ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దెత్తున తరలి వస్తున్నారు.
గుంటూరు కారం సినిమా విడుదలైన మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికి ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో థియేటర్స్లో సందడి చేస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాకు మహేష్ బాబే ప్రాణం అని చెప్పక తప్పదు. మూవీ మొదలైంది మొదలి చివరి వరకు న్యూ లుక్ లో కనిపించి గుంటూరు యాసలో మాట్లాడి ప్రేక్షకులను మెప్పించారు. ఇక కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ లో పూనకాలు తెప్పించాడు మహేష్ బాబు. మూవీకి మంచి స్పందన రావడంతో మూటీ టీమ్ పండుగ చేసుకుంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ బాబు, శ్రీలీల సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. అయితే ఈ మూవీలో మహేష్ ఫస్ట్ షాట్ నుంచి బీడీ కాలుస్తూ కనిపిస్తాడు. ఇలా చాలా రోజుల తర్వాత ప్రిన్స్ ఇలా స్మోక్ చేస్తూ కనిపించాడు. క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో సినిమా మొత్తం మహేష్ బాబు నోట్లీ ఏదోరకంగా బీడీ ఉంటూనే ఉంటుంది. సీన్స్ ను బట్టి వాటిని కాల్చుతూ కనిపించాడు మహేష్ బాబు. అయితే ఈ విషయంలో ఫ్యాన్స్ అయితే కాస్త కంగారు పడ్డారు. మహేష్ హెల్త్ గురించి ఆలోచించారు.
లేటెస్టుగా మహేష్ ఈ విషయంపై ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ” నాకు స్మోకింగ్ అలవాటు లేదు. దానిని నేను అస్సలు ఎంకరేజ్ చేయను. అయితే మూవీ స్మోక్ చేయాల్సి వచ్చింది. అయితే అవి పొగాకుతో చేసిన బీడీలు కావు. నా కోసం ప్రత్యేకంగా ఆయుర్వేదిక్ బీడీలు తీసుకొచ్చారు. ఈ బీడీల్లో పొగాకు అస్సలు ఉండదు. అవి పూదీనా ఫ్లేవర్ లో ఉండే బీడీలు. డైరెక్టర్ చెప్పినట్లు ఫస్ట్ పొగాకుతో ఉన్న బీడీని ట్రై చేశాను. అయితే అవి కాల్చడం వల్ల విపరీతమైన హెడ్ ఏక్ వచ్చింది. అందుకే ఆయుర్వేదిక్ బీడీలను వాడాను. లవంగం, యాలకలు ఫ్లేవర్ తో ఈ బీడీలను తయారు చేశారు. వీటి వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు” అని మహేష్ బాబు తెపారు .
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.