Mahesh Babu : మహేష్ బాబు ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్..సెకెండ్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Mahesh Babu : త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‎లో వస్తున్న మూవీ గుంటూరు కారం. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఊపందుకుంది. ఎట్టిపరిస్థితిలో గుంటూరు కారం సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఆ ప్రణాళికకు తగ్గట్టుగానే ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా సినిమా పూర్తి చేస్తున్నారు.డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ సాధించాలని కసిగా పనిచేస్తున్నాడు. ఎందుకంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి త్రివిక్రమ్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రిన్స్ మహేష్ కూడా చాన్నాళ్లు షూటింగ్ కు దూరంగా ఉంటూ వచ్చారు.

mahesh-babu-gunturkaaram-second-song-release-date-confirm

ఎట్టకేలకు ఈ మధ్యనే అన్ని అవరోధాలు దాటుకుని మళ్లీ షూటింగ్ మొదలైంది. దీంతో సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకొచ్చే విధంగా ఓ రేంజ్ లో ప్రమోషన్స్ ని మొదలుపెట్టేశారు మేకర్స్. మహేష్ సినిమా అంటే మామూలుగా ఉండదు. మూవీ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అందరి మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ధమ్ మసాలా సాంగ్ ఇరగదీస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరపరిచిన మాస్ సాంగ్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది.

mahesh-babu-gunturkaaram-second-song-release-date-confirm

ఇక ఈ మూవీ నుంచి రెండో పాట ఏంటా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే లాస్ట్ వీక్ లోనే ఈ సాంగ్ ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. గుంటూరు కారం ప్రొడ్యూసర్ నాగ వంశీ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు . కానీ మళ్ళీ ఏమైందో ఏమో ఆ నిర్ణయాన్ని పోస్ట్ పోన్ చేశారు. అయితే ఫస్ట్ వీక్ అంతా అనిమల్ హడావిడి ఉండడంతో రిలీజ్ ఎందుకులే అని అనుకున్నారు కాబోలు అందుకే వాయిదా వేశారు అంటున్నారు విశ్లేషకులు.. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి విడుదల పక్కా అని డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారు . ఈ లెక్కన నెక్స్ట్ వీక్ సెకండ్ సింగిల్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ రెండో పాట మెలోడీగా ఉండబోతుందట. ఈ సాంగ్ మహేష్ శ్రీలీల మధ్యలో ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది.

mahesh-babu-gunturkaaram-second-song-release-date-confirm

తమన్ త్రివిక్రమ్ అల..వైకుంఠపురములో అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. మళ్లీ ఈ కాంబినేషన్ గుంటూరు కారంలో కలిసి పనిచేస్తోంది. దీనితో మ్యూజిక్ పై మంచి అంచనాలు ఉన్నాయి. మొదటి పాట ఫ్యాన్స్ ఊహించని రేంజ్ లో వైరల్ కాలేదు కానీ రెండో పాట అయినా ఇక ట్రెండ్ సెట్ చేస్తుందని నాగవంశీ కాన్ఫిడెంట్గా తెలిపారు.

Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

1 day ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

1 day ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

3 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

4 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

4 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

5 days ago

This website uses cookies.