Maha shivrathri: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే పండుగలలో మహాశివరాత్రి పండుగ ఒకటి ఈ పండుగ రోజున రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున శివాలయాలలో శివనామ స్మరణలతో మారు మోగుతూ ఉంటాయి. అంతేకాకుండా ప్రజలందరూ కూడా శివపార్వతుల కళ్యాణం జరిపించడమే కాకుండా ఉపవాస జాగరణలతో ఆ శివయ్యను ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. మరి ఈ ఏడాది మహాశివరాత్రి పూజకు అనువైన సమయం ఏంటి ఈ పండుగ ఎప్పుడు వచ్చింది, పండుగ రోజు పాటించాల్సిన నియమాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం..
మహాశివరాత్రి పండుగ ఈ ఏడాది మార్చి 8వ తేదీ వచ్చింది అయితే మార్చి 8వ రోజు శివయ్య అనుగ్రహాన్ని పొందడం కోసం పొద్దున్నే స్నానం చేసి శివపార్వతులకు ప్రత్యేకంగా పూజలను నిర్వహించి అనంతరం ఉపవాసాలను ప్రారంభిస్తూ ఉంటారు అయితే ఉపవాసం ఉన్నటువంటి వారు ఏ విధమైనటువంటి మాంసాహారం మద్యం వంటి పదార్థాలను ముట్టుకోకూడదు అంతేకాకుండా ఉల్లిపాయ, వెల్లుల్లి వేసినటువంటి ఆహార పదార్థాలను అసలు తినకూడదు.
వీలైనంతవరకు ఉపవాసం చేసేవారు పండ్లు,పండ్ల రసాలను పాలు వంటి వాటిని తీసుకొని ఉపవాసం చేయాల్సి ఉంటుంది. ఈ రోజున ఏదైనా ప్రత్యేక కోరికను నెరవేర్చుకోవడానికి శుభ సమయంలో శివుడిని పూజించాల్సి ఉంటుంది. ఈ రోజు నిశిత కాలం.. పూజ సమయం రాత్రి 12:07 నుండి 12:56 వరకు ఉంటుంది. మహాశివరాత్రి ఉపవాసం, పారణ సమయం మార్చి 9, 2024న ఉదయం 6:37 నుండి మధ్యాహ్నం 3:29 వరకు ఉంటుంది. ఇలా పూజ చేసిన తర్వాత శివ చాలీసా చదివి స్వామివారికి హారతులు ఇచ్చి నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.