Madavan : సీనియర్ యాక్టర్ మాధవన్ సినిమాలు, సిరీస్ లు అంటూ యమ జోరుగా దూసుకువెళ్తున్నారు. అప్పట్లో ఇండస్ట్రీ లో మాధవన్ పని ఫినిష్ అయ్యిందని విమర్శలు చేశారు. కానీ ఆయన మాత్రం వరుస హిట్ లతో అందరి నోర్లు మూయించారు. తన ఏజ్ కు తగ్గ క్యారెక్టర్లు చేస్తూ యూనిక్ సబ్జెక్ట్ లను ఎంపిక చేసుకుంటూ మళ్లీ బిజీ అయ్యారు. ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
తాజాగా మాధవన్ ‘ది రైల్వే మెన్’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అల్లరిస్తున్నారు. ఆ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సిరీస్ లో తనతో యాక్ట్ చేసిన ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జూహీ చావ్లా గురించి ఆశ్చర్య కరమైన విషయాలు చెప్పారు.ఆమె పై తనకు యంగ్ ఏజ్ లో ఉన్న అభిమానాన్ని, ప్రేమను తెలిపారు. ఆ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతూ.. ” హిందీలో విడుదలైన ఖయామత్ సే ఖయామత్ తక్ మూవీ చూసిన సమయంలో నేను ఆ మూవీలో యాక్ట్ చేసిన నటి జూహీ చావ్లా ను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఆ సినిమాతో ఆమెపై విపరీతమైన అభిమానం పెంచుకున్నాను. పెళ్లి చేసుకుంటే ఆమెనే ఆమెనే చేసుకుంటాను అని అమ్మకి అప్పుడే చెప్పాను” అని ఆయన తెలిపారు.
అయితే జూహీ చావ్లా హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మాధవన్ ఇంకా తన కెరీర్ ను ప్రారంభించలేదు. అయినా కూడా ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం నిజంగా కాస్త విడ్డూరంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొందరు నెటిజన్స్ జూహీ పై అతడికి ఉంది అభిమానం కాదని , అంతకు మించి ఉండంటూ కామెంట్స్ చేస్తున్నారు. ది రైల్వే మెన్ వెబ్ సిరీస్ లో మాధవన్ జూహీ తో కలిసి నటించారు. ఇలా తన అభిమాన నటితో యాక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.