Latest Cinema News : ‘చంద్రముఖి’..ఈ సినిమా చాలా గ్యాప్ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ కి సాలీడ్ సక్సెస్ ని ఇచ్చింది. ఇందులో నటించిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు దక్కింది. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో భార్య, టాలెంటెడ్ హీరోయిన్ జ్యోతిక కి ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. ‘చంద్రముఖి’ ఆవహించిన సమయంలో జ్యోతిక నటన మహాద్భుతం. క్లైమాక్స్ సన్నివేశం అయితే, ఎప్పుడు చూసిన ఒళ్ళు గగుర్పొడుస్తుంది.
దీనికి ముందు కన్నడ సౌందర్య ప్రధాన పాత్ర పోషించిన ‘ఆప్తమిత్ర’ ఇదే రేంజ్ సక్సెస్ ని అందుకుంది. సైకియాట్రిస్ట్ గా, వేంకటపతి మహారాజుగా రజినీ పర్ఫార్మెన్స్ సినిమాకే హైలెట్. అయితే, ఇప్పుడు ‘చంద్రముఖి’ సినిమాకి సినిమాకి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ వస్తోంది. ఇందులో రజినీకాంత్ పొషించిన పాత్రను ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ రాఘవ లారెన్స్ పోషిస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Latest Cinema News : కంగనాని జ్యోతిక తో పోల్చుకుంటున్నారు.
ఇక అప్పుడు సౌందర్య, జ్యోతిక పోషించిన ‘చంద్రముఖి’ పాత్రను బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పోషించింది. గెటప్ వరకూ బాగానే ఉన్నా పర్ఫార్మెన్స్ మాత్రం అంతగా సెట్ కాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులు కంగనాని జ్యోతిక తో పోల్చుకుంటున్నారు. ఎంత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా జ్యోతిక మాదిరిగా చేసినట్టు లేదే..? అని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకముందు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ విషయంలో కూడా ఇలాగే టైటిల్ రోల్ ప్లే చేసిన కంగనా కామెంట్స్ కి గురైంది. ఇప్పుడు ‘చంద్రముఖి 2’ సినిమా రిలీజ్ కాకముందే నెటిజన్స్ జ్యోతిక ఫ్యాన్స్ ఈ క్వీన్ ని బాగానే ట్రోల్ చేస్తున్నారు. మరి రేపు సినిమా రిలీజయ్యాక తన పర్ఫార్మెన్స్ తో అందరి నోర్లు మూతపడేలా చేస్తుందా లేక అందరూ అనుకున్నటే జ్యోతిక ముందు తేలిపోతుందా చూడాలి. కాగా, ఈ సినిమాను సెప్టెంబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. పి.వాసు దర్శకుడు.
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.