Lambasingi Movie Review : ప్రతీ వారం లాగానే ఈ వారం దాదాపు 10 సినిమాల వరకు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. వాటిలో ‘లంబసింగి’ చిత్రం కూడా ఒకటి. యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకున్న ‘బిగ్ బాస్’ దివి వడ్త్య ముఖ్య పాత్రలో రూపొందిన ఈ సినిమాని సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘బంగార్రాజు’ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తూ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టడం కూడా విశేషం. ‘కాన్సెప్ట్ ఫిల్మ్స్’ పతాకంపై ఆనంద్ తన్నీరు ఈ చిత్రాన్ని నిర్మించారు. నవీన్ గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వ్వం వహించగా.. భరత్ రాజ్ హీరోగా పరిచయమవుతున్నాడు. కాగా, ఈ చిత్రం ఈరోజు (మార్చి 15 న ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎంత వరకు ఆకట్టుకుందో సినిమాకి ఎలాంటి రివ్యూలు వస్తున్నాయో తెలుసుకుందాం.
Lambasingi Movie Review : కథ : వీరబాబు(భరత్ రాజ్) కానిస్టేబుల్ గా ఎంపికవుతాడు. ‘లంబసింగి’ అనే ఊరిలో అతనికి పోస్టింగ్ పడుతుంది. మొదటి చూపులోనే హరిత(దివి) ని చూసి ప్రేమలో పడతాడు. అయితే హరిత ఒక మాజీ నక్సలైట్ కూతురు అనే విషయం తర్వాత తెలుస్తుంది. ఆ ఊరిలో నక్సలైట్లు గా ఉన్న చాలా మందికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. వారిలో హరిత తండ్రి ఒకరు. అయితే, వారితో పోలీసులు రోజూ సంతకాలు పెట్టించుకుని వాళ్ళని గమనిస్తూ ఉండాలి. ఈ క్రమంలో కొత్తగా ఆ ఊరు వచ్చిన వీరబాబుకి ఈ విధులు అప్పగిస్తారు. హరితని ప్రేమలో దింపడానికి అతను కూడా రోజూ ఆమె తండ్రితో సంతకం పెట్టించడానికి ఆమె ఇంటికి వెళ్లి వస్తుంటాడు. ఇక హరిత అదే ఊరిలో నర్సుగా పనిచేస్తూ ఉంటుంది.
ఒకరోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని కాపాడే క్రమంలో హరితకి మరింత దగ్గరవుతాడు వీరబాబు. ఇంతకంటే మంచి ఛాన్స్ రాదని భావించిన వీరబాబు హరితకి తన ప్రేమ గురించి చెప్పాలనుకుంటాడు. సమయం చూసి హరితకి తన ప్రేమని బయటపెడతాడు. కానీ, దీనికి హరిత ససేమిరా అంటుంది. ఇక ఓ రోజు వీరబాబు ఒక్కడే పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉండగా.. కొందరు నక్సలైట్లు దాడి చేసి అక్కడ ఉన్న అక్రమ ఆయుధాలను తీసుకెళ్ళిపోతారు. ఈ దాడిలో గాయపడిన వీరబాబుకి మరో షాక్ తగులుతుంది. అదేంటి? అసలు హరిత తన ప్రేమని ఎందుకు నిరాకరించింది? ఆమె గతం ఏంటి? సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
Lambasingi Movie Review : విశ్లేషణ : ‘లంబసింగి’ వంటి మంచి కథ, కథనం ఉన్న చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇటీవల కాలంలో మంచి పాయింట్ తో చిత్రాలను తీసి యువ దర్శకులు పెద్దల మన్నలను పొందుతున్నారు. అలాంటి వారిలో దర్శకుడు నవీన్ గాంధీ కూడా చేరతాడనంలో సందేహమే లేదు. ఆయన ఎంపిక చేసుకున్న పాయింట్ చాలా కొత్తగా ఉంది. ఫస్ట్ హాఫ్ లో కథ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఊపందుకుంటుంది. ఇందులో హీరోయిన్ గా నటించిన దివి సన్నివేశాలను, దర్శకుడు చాలా బాగా రాసుకున్నారు..అంతే బాగా తెర మీద చూపించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ ఎవరి ఊహకీ అందదు. దాంతో సినిమా చూస్తున్న ప్రేక్షకుడు థ్రిల్ ఫీలవుతాడు.
ఇక సెకండ్ హాఫ్ మొదలైనప్పటి నుంచి కథ చాలా ఆకస్తికరంగా సాగుతుంది. ఈ విషయంలో ఖచ్చితంగా దర్శకుడి పని తీరును మెచ్చుకోవాల్సిందే. స్క్రీన్ ప్లేని చాలా పగడ్బందీగా డిజైన్ చేసుకోవడంతో తర్వాత ఏం జరుగుతుందో అనే ఆలోచన ప్రేక్షకుడికి రాకుండా కథలో లీనం అయిపోతారు. వీరబాబు, రాజు పాత్రలతో చేయించిన కామెడీకి థియోటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. ఇక క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అప్పటి వరకూ ఉన్న ప్రేక్షకుడి మూడ్ ఒక్కసారిగా మారి అందరూ చాలా ఎమోషనల్ అవుతారు. థియేటర్ నుండి బయటకి వచ్చే ప్రేక్షకుడు ఆ ఫీల్ ను క్యారీ చేస్తూ వస్తాడు.
Lambasingi Movie Review : టెక్నికల్ గా చూస్తే : దర్శకుడు నవీన్ గాంధీ ఎంచుకున్న కథలో ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా ‘లంబసింగి’ ని అద్భుతంగా రూపొందిన్చాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు..ఊహించని ట్విస్ట్ అలాగే సెకండ్ హాఫ్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. 2 గంటల 2 నిమిషాల పాటు ప్రతి ప్రేక్షకుడు మనం థియేటర్ లో ఉన్నామా లేక ‘లంబసింగి’ అనే ప్రపంచంలో ఉన్నామా..! అనేలా చేశాడు. ముఖ్యంగా ఆర్.ఆర్.ధృవన్ అందించిన సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళింది. ఇటీవల వచ్చిన చిన్న సినిమాలలో ఇంత మంచి పాటలు ఉంటాయని, వింటామని లంబసింగి చూస్తే అర్థమవుతుంది. ఈ పాటలను తెరపై కూడా అద్భుతంగా చూపించారు కె.బుజ్జి. ఇక ఎడిటర్ విజయ్ వర్ధన్ కావూరి వర్క్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఎక్కడా ఈ సీన్ అనవసరం అనిపించదు.
Lambasingi Movie Review : నటీనటుల విషయానికి వస్తే.. ఇప్పటి వరకు దివిని సోషల్ మీడియాలో గానీ, ఇంతకముందు చేసిన సినిమాలలో గానీ ఎక్కువగా గ్లామర్ పాత్రల్లోనే కనిపించింది. దర్శకులు కూడా అదే కోణంలో చూపించారు. కానీ, ఆమెలో సహజమైన నటి ఉందని ‘లంబసింగి’ ద్వారా అందరికీ తెలిసొచ్చేలా చూపించారు దర్శకుడు. హరిత పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఆమె పాత్రలో ట్విస్ట్..లు కూడా ఊహించని విధంగా ఉంటాయి. దర్శకుడు నవీన్ గాంధీ.. మాదిరిగానే మిగిలిన దర్శకులు కూడా దివిలో ఉన్న నటిని గమనిస్తే.. కచ్చితంగా ఆమె సినీ కెరీర్ మరోలా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక హీరో భరత్ వీరబాబు పాత్రలో నేచురల్ గా పర్ఫార్మ్ చేసి ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్ లో చూపించిన ఎమోషనల్ పెర్ఫార్మన్స్ తో మంచి ప్రశంసలు దక్కించుకుంటాడు. ఇక వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, ఈవీవీ, నవీన్ రాజ్ సంకరపు, ప్రమోద్, రమణ, పరమేష్, సంధ్య.. తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించి పూర్తి న్యాయం చేశారు.
Lambasingi Movie Review : ఫైనల్ గా : ‘లంబసింగి’ కచ్చితంగా ప్రతి ప్రేక్షకుడిని అలరించే సినిమా. 2 గంటల 2 నిమిషాల పాటు ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇలాంటి సినిమాలు ఎంతో అరుదుగా వస్తాయి. ఇటీవల వచ్చిన హను మాన్ ఎలా అయితే ఊహించని రికార్డ్స్ నమోదు చేసిందో చిన్న సినిమాగా వచ్చిన ‘లంబసింగి’ కూడా కచ్చితంగా అలాంటి రికార్డ్స్ నమోదు చేస్తుందని చెప్పవచ్చు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.