Monalisa: ఒక్క అవకాశమంటే ఎంతో. అలాంటి ఒక్క ఛాన్స్ కోసం ఏళ్ల తరబడి సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగే వాళ్లు ఎందరో. మరికొందరికి మాత్రం అదృష్టం అనూహ్యంగా తలుపుతట్టి వస్తుంది. సోషల్‌మీడియాలో ఒక్క వీడియోతో ఫేమస్ అయ్యి, ఆ పేరుతో అవకాశాలొచ్చే సందర్భాలు అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి రేర్ ఇన్సిడెంట్స్‌లో ఒకటి కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా కథ.ఒక ఇంటర్వ్యూలో మోనాలిసా మాట్లాడుతూ ‘‘షాప్ ఓపెనింగ్స్‌కు వస్తావా? అంటూ ఆహ్వానాలు అందాయి. నేను అవన్నీ ఓకే చెప్పేశాను. జీవితంలో వచ్చిన అవకాశాన్ని వదులుకోవాలనిపించలేదు. నవ్వుతూ ముందుకు వెళ్లిపోయాను’’ అంటూ చెప్పింది.
ఇటీవలే ఆమె నటించిన తొలి పాట ‘సాద్‌గి’ విడుదలైంది. అందులో మోనాలిసా మరింత అందంగా కనిపించింది. అయితే నటనలో ఇంకా మెరుగుదల అవసరమన్న అభిప్రాయాలు వినిపించాయి. నటించడం తనకు ఇది తొలిసారి కావడంతో మొదట్లో కాస్త జంకినప్పటికీ, ఆ అనుభవం చాలా నచ్చిందని మోనాలిసా చెప్పింది. ‘‘సింగర్ ఉత్కర్ష్ శర్మ సర్ ఆఫర్ ఇచ్చినప్పుడు ముందుగా ఇంట్లో చెప్పాను. వారు ఓకే అనడంతోనే షూటింగ్‌కు వెళ్లాను. ఆ పాట కథ కూడా నాకు బాగా నచ్చింది. ఇప్పుడు కెమెరానే నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. కెమెరా ముందు కళ్లతోనే భావాలు పలికించడం, డ్యాన్స్ చేయడం చాలా కొత్త అనిపించింది’’ అని మోనాలిసా వివరించింది.
ఇంతలోనే ఆమె ఖరీదైన కారులో కూర్చున్న ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె ప్రయాణిస్తున్న కారు విలువ సుమారు రూ.1 కోటి ఉంటుందని చెబుతున్నారు. కేవలం రూ.100కి పూసలదండ అమ్ముకున్న అమ్మాయి.. ఇప్పుడు కోటి రూపాయల కారులో వెళ్తుండటాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతూ, ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.ప్రస్తుతం మోనాలిసా “ది డైరీ ఆఫ్ మణిపూర్” అనే చిత్రంలో నటిస్తోంది. ఆమె కథ ఇప్పుడు ఎంతో మందికి ప్రేరణగా మారుతోంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.