Krithi Shetty : ఉప్పెన సినిమాతో టాలీవుడ్ మేకర్స్‌లో హాట్ టాపిక్ అయిన కుర్రభామ కృతిశెట్టి..కొన్నాళ్ళు వరుస సినిమాలతో ఓ ఊపు ఊపేసింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ అంతటా తనే కనిపించింది. హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమా ఉప్పెనతోనే 100 క్లబ్‌లో చేరింది. ఆ తర్వాత చేసిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజక వర్గం వరుసగా బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే, ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజక వర్గం డిజాస్టర్ కావడంతో అమ్మడి జోరు తగ్గింది.
వాస్తవానికి ఇప్పుడు అందరూ అనుకుంటున్నది ఇదే. కానీ, కృతిశెట్టి ఊపు తగ్గలేదని ఇప్పుడు తను చేస్తున్న సినిమాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. బంగార్రాజు సినిమా హిట్ తర్వాత మరోసారి ఈ బ్యూటీ అక్కినేని నాగ చైతన్య సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. కస్టడీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. అలాగే, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన ఓ సినిమానూ చేస్తోంది.
ఈ సినిమా షూటింగ్ కాస్త నెమ్మదిగా సాగుతోంది. అలాగే, మలయాళంలో ట్వినో థామస్ హీరోగా రూపొందనున్న భారీ పాన్ ఇండియా చిత్రంలో కూడా కృతి శెట్టి హీరోయిన్. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సైన్ కూడా చేసింది. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోమంది. ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ మూవీతోనే వారు మలయాళం ఇండస్ట్రీలోక్ అడుగుపెడుతుంది. ఇదీ అమ్మడి సినిమాల లిస్ట్. ప్రస్తుతం చేస్తున్న వాటిలో రెండు పాన్ ఇండియా సినిమాలు.. మూడు సౌత్ ద్విభాష చిత్రాలు కృతిశెట్టి చేతిలో ఉండటం ఆసక్తికరమైన విషయం. కానీ, చాలామంది ఈ సినిమాల విషయం తెలీక అమ్మడి పనైపోయిందనుకుంటున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.