Krishnastami: ప్రతి ఏడాది శ్రావణమాసంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే కృష్ణుడి వేషధారణలో వారిని అలంకరిస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఇంట్లో కృష్ణుడికి ప్రత్యేకంగా పూజలను నిర్వహిస్తూ ఉంటారు అయితే ఎంతో ముఖ్యమైనటువంటి ఈ కృష్ణాష్టమి రోజు కొన్ని రకాల వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
మరి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఎలాంటి వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి ఏంటి అనే విషయానికి వస్తే.. మనకు కృష్ణుడి తలపై ఎప్పుడూ కూడా నెమలి పించం కనబడుతూ ఉంటుంది అందుకే కృష్ణాష్టమి రోజు నెమలి పించం ఇంటికి కనుక తెచ్చుకుంటే ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ నెమలి పించం ఇంట్లో ఉండటం వల్ల ఏ విధమైనటువంటి కలహాలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటారని భావిస్తారు. ఇక నెమలి పించంతో పాటు పిల్లనగ్రోవి తెచ్చుకోవడం చాలా మంచిది అలాగే వ్యాపారాలు ఉన్నచోట ఈ పిల్లనగ్రోవి పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుంది.
ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు సరస్వతి చేతిలో ఉండే వీణను తీసుకురావడం వల్ల పిల్లలకు చదువులు ఏకాగ్రత కలుగుతుంది. మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి. అందుకే ఈ వస్తువులను కృష్ణాష్టమి రోజు ఇంటికి తెచ్చుకోవడం ఎంతో మంచిది. ఇక ఈరోజు కృష్ణుడికి ప్రత్యేకంగా పూజలను చేసి తేనెతో చేసిన నైవేద్యాన్ని సమర్పించడం ఎంతో మంచిది. ఇక పూజ సమయంలో మన ఇంట్లో కృష్ణుడి పాదాలు వేయటం వల్ల ఇల్లంతా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి.
Game Changer Trailer: ధృవ, రంగస్థలం కలిపితే 'గేమ్ ఛేంజర్' సినిమానా..? తాజాగా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే…
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
This website uses cookies.