Kotamreddy Sridhar Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చుట్టూ ఇప్పుడు నెల్లూరు రాజకీయాలు తిరుగుతున్నాయి అనే సంగతి అందరికి తెలిసిందే. వైసీపీ అధిష్టానం, ముఖ్యమంత్రి జగన్ కి మేకులా ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తయారయ్యారు. మొన్నటి వరకు నమ్మినబంటుగా ఉన్న అతను ఒక్కసారిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకి రావడంతో అధిష్టానంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నమ్మకం లేని చోట ఉండలేను అంటూ మీడియా ముందుకి వచ్చి చెప్పేశారు.
అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారడంతో వైసీపీ నేతలు అందరూ కూడా కవర్ డ్రైవ్ లు ఆడుతూ కోటంరెడ్డిపై మూకుమ్మడి దాడి చేస్తున్నారు. ఓ వైపు సోషల్ మీడియా ద్వారా, మరో వైపు అవినీతి ఆరోపణలు చేస్తూ నియోజకవర్గం ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో నెల్లూరు జిల్లాకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులతో విమర్శలు చేయిస్తున్నారు.
టీడీపీ నుంచి వైసీపీ గూటికి వెళ్ళిన వల్లభనేని వంశీ కూడా చివరికి కోటంరెడ్డి మీద కామెంట్స్ చేయడం విశేషం. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం పార్టీకి లేదని, నాయకులు అందరూ కోటంరెడ్డిపై విమర్శల దాడి చేస్తున్నారు. ఇక వాటినిని తట్టుకొని కోటంరెడ్డి కూడా తగ్గేది లే అంటూ తిరిగి కౌంటర్లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఇప్పటికే కోటంరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ నేపధ్యంలో ముందుగానే చంద్రబాబుతో కోటంరెడ్డి మాట్లాడుకున్నారు అంటూ దాడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఏం చేస్తారు అనే ప్రశ్నకి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
టీడీపీ కాకుంటే జనసేన తరుపున లేదంటే బీజేపీ తరుపున పోటీ చేస్తా. ఈ పార్టీలు ఏవీ టికెట్ ఇవ్వను అంటే బీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేస్తా. ఇప్పుడు ఎలాగూ కేసీఆర్ ఏపీలోకి వచ్చారు. అక్కడ వర్క్ అవుట్ కాకపోతే తమిళనాడు వెళ్లి అన్నాడిఎంకెలో జాయిన్ అవుతా. ఒక వేళ అది సెట్ కాకుంటే ములాయంసింగ్ యాదవ్ పార్టీలో, లేదంటే అఖిలేష్ యాదవ్ పార్టీలో చేరుతా. ఆ పార్టీ తరుపున ఇక్కడ పోటీ చేస్తా . ప్రజా సేవ చేయడానికి, ఎన్నికలలో పోటీ చేయడానికి తనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయని కోటంరెడ్డి చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.