Kodali Nani: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువగా చేస్తుంది అనే సంగతి అందరికి తెలిసిందే. నారా లోకేష్ పాదయాత్ర మొదలు కాగానే ఏపీ రాజధానిగా విశాఖపట్నం అంటూ ఏకంగా ముఖ్యమంత్రి ప్రకటన చేసి ప్రజల దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేశారు. అయితే అది వర్క్ కాలేదు. కాని కొంత వరకు టీడీపీ నాయకులు జగన్ కామెంట్స్ పై విమర్శలు చేశారు. ఇక సుప్రీం కోర్టులో ఉన్న అంశంపై జగన్ ఎలా మాట్లాడుతాడు అంటూ నిలదీశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ వైపు వైఎస్ వివేకానంద హత్యా కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ కి ఈ కేసు చుట్టుకునేలా కనిపిస్తుంది. సీబీఐ అధికారులు జగన్ రెడ్డి ఓఎస్డీ వరకు వచ్చేశారు.
మరో వైపు నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యేలు ఎదురుతిరిగి వైసీపీ అధిష్టానంపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఈ రెండు విషయాల చుట్టూ ప్రజల ఆలోచనలు తిరుగుతున్నాయి. అయితే ఈ అంశాలు వైసీపీపై వ్యతిరేకత పెంచే ప్రమాదం ఉందని గ్రహించిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు మరో కొత్త డైవర్షన్ ని తెరపైకి తీసుకొచ్చింది. తాజాగా ఎమ్మెల్యే కొడాలి నాని మీడియా ముందుకి వచ్చి సీనియర్ ఎన్టీఆర్ మరణంపై అనుమానం ఉందని కేంద్ర ప్రభుత్వం దీనిపై విచారణ చేయాలని కోరుతున్నారు. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తానని తెలిపాడు. అలాగే నందమూరి ఫ్యామిలీ రాజకీయాలలోకి వద్దామని అనుకున్న సమయంలోనే వారి కుటుంబంలో ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని అన్నారు.
హరికృష్ణ తెలుగుదేశానికి వ్యతిరేకంగా మారుతున్నారని పరిణామాలు కనిపించిన సమయంలో అయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని అన్నారు. అలాగే నందమూరి తారకరత్న ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్న టైంలో కుప్పంలో ఆయనకి గుండెపోటు రావడం హాస్పిటల్ లో పడటం జరిగిందని అన్నారు. వీటి వెనుక కుట్ర కోణం ఉందని కామెంట్స్ చేశారు. వీటి వెనుక అనుమానాలు ఉన్నాయని, సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే కొడాలి నాని కేవలం వైసీపీ వ్యూహంలో భాగంగానే ప్రజల ఆలోచనని డైవర్ట్ చేయడానికి ఈ వ్యాఖ్యలు చేసి తెరపైకి కొత్త అంశాన్ని తీసుకొచ్చారనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఎన్టీఆర్, నందమూరి కుటుంబం అభిమానిగా చెప్పుకునే కొడాలి నానితో ఈ రకమైన వ్యాఖ్యలు చేయించడం ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టి, ప్రజల దృష్టి పూర్తిగా వివేకానంద హత్యకేసు విచారణ, అలాగే కోటంరెడ్డి ఇష్యూ నుంచి డైవర్ట్ అవుతుందని ఇలా ప్లాన్ చేసినట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.