Sugar Test: షుగర్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.షుగర్ వ్యాధి నియంత్రణలోకి తీసుకురావడానికి శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చేస్తున్న కృషి ఫలించలేదని చెప్పొచ్చు.షుగర్ వ్యాధి చాప కింద నీరులా శరీరంలో ఒక్కో అవయవాన్ని క్షీణింప చేస్తూ చివరకు అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. చాలామందిలో షుగర్ వ్యాధి సోకిందన్న విషయం తెలిసేలోపే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోతుంది. షుగర్ వ్యాధి రావడానికి గల కారణాలను పరిశీలిస్తే మారుతున్న ఆహారపు అలవాట్లు,శారీరక శ్రమలోపించడం వంటివి ప్రధానంగా చెప్పొచ్చు.
షుగర్ వ్యాధి ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే మొదట వ్యాధి పట్ల పూర్తి అవగాహన పెంచుకోవాలి, క్రమశిక్షణ కలిగిన ఆహార నియమాలు పాటించాలి, శారీరక శ్రమ కలిగిన వ్యాయామం,నడక,యోగ, ధ్యానం, సైక్లింగ్, స్విమ్మింగ్, డాన్స్ వంటివి అలవాటు చేసుకోవాలి.షుగర్ వ్యాధి లక్షణాలు మొదట కళ్ళు ,కిడ్నీ అవయవాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఏమాత్రం అనుమానం వచ్చిన వైద్య సలహాలు తీసుకొని షుగర్ టెస్ట్ చేయించుకోవాలి.
ఫాస్టింగ్ బ్లడ్ షుగర్100 ఎంజి/డిఎల్ ఉంటే నార్మల్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్100 నుండి 126 ఎంజి/డిఎల్ ఉంటే ఫ్రీ డయాబెటిస్ స్టేజ్ లో ఉన్నట్టు గ్రహించుకోవాలి. అదే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 126ఎంజి/డిఎల్ కంటే ఎక్కువగా ఉంటే మీరు షుగర్ వ్యాధి బారిన పడినట్లే లెక్క. అలాగే ఏహ్ బీ ఏ 1సి టెస్ట్ లో 5.7 శాతం వరకు నార్మల్,5.7 శాతం నుంచి6.4 శాతం వరకు ఫ్రీ డయాబెటిస్,6.5 శాతం ఉంటే డయాబెటిస్ ఉన్నట్లే. భోజనం చేసిన రెండు గంటల తర్వాత బ్లడ్ షుగర్140 ఎంజి/డిఎల్ దాటితే షుగర్ ఉన్నట్లు వైద్యులు సూచిస్తారు.
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
Sreeleela: శ్రీలీల కెరీర్ క్లోజ్ అని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో తానే చిన్న బ్రేక్ తీసుకున్నట్టు క్లారిటీ ఇచ్చింది. కన్నడ,…
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
This website uses cookies.