Technology: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ పరుగులు పెడుతుంది. అభివృద్ధి అంతా టెక్నాలజీతో అనుబంధమై నడుస్తుంది. ప్రపంచంలో మెజారిటీ ప్రజలు స్మార్ట్ ఫోన్ వినియోగానికి అలవాటు పడ్డారు. వారి రోజువారి జీవితాల్లో ఇది కూడా ఒక ప్రధానమైన వస్తువుగా మారిపోయింది. అలాగే కంప్యూటర్లు, ల్యాప్టాప్లపై ఉద్యోగాలు చేసే వారి సంఖ్య వందల కోట్లలోనే ఉంది. అన్ని అవసరాలకు స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ అనేవి ఖచ్చితంగా అవసరమైన వస్తువులుగా మారిపోయాయి.
గత మూడేళ్ల కాలంలో కరోనా ప్రభావంతో పిల్లల చదువులు కూడా ఆన్లైన్ కి పరిమితమయ్యాయి. ఈ కాలంలో తరగతి చదువు లేకపోవడంతో డిజిటల్ క్లాసులు వింటూ పిల్లలు చదువుకున్నారు. ఇప్పుడు మరలా తరగతి చదువులు మొదలైన కూడా మరోవైపు డిజిటల్ క్లాసులను కూడా విద్యాసంస్థలు ప్రోత్సహిస్తున్నాయి.
మరోవైపు చిన్న వయసు నుంచే పిల్లలు స్మార్ట్ ఫోన్ లో గేమ్స్ కి, సోషల్ మీడియాలో కిడ్స్ రిలేటెడ్ వీడియోలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఫోన్స్ ఇవ్వకుంటే పిల్లలు మారం చేసే స్థాయికి వెళ్లిపోయారు. వీళ్లను నియంత్రించటం తల్లిదండ్రులకి కూడా సాధ్యం కావడం లేదు. స్మార్ట్ ఫోన్ లో వీడియో గేమ్స్ పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గేమ్స్ కి బానిసగా మారి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది.
వారిలో మానసిక ఎదుగుదల ఉండదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే తాజాగా ఈ అంశంపై పియర్సన్ గ్లోబల్ లెర్నర్స్ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. అమెరికా బ్రిటన్, బ్రెజిల్, చైనాతో పాటు భారత్లో కూడా ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా మూడు వేల మంది పైచిలుకు తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఇందులో 40 శాతం మంది తల్లిదండ్రులు వీడియో గేమ్ల కారణంగా పిల్లల్లో మానసిక సామర్థ్యం పెరుగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే సోషల్ మీడియా కారణంగా పిల్లల తెలివితేటలు పెరుగుతున్నాయని 30 శాతం మంది తల్లిదండ్రులు చెప్పడం విశేషం. అయితే ఆన్లైన్ తరగతుల వైపు తల్లిదండ్రులు తమ ఆసక్తిని చూపించలేదు. ప్రత్యక్షంగా తరగతి గదుల్లో చదువులు అయితేనే పిల్లలకు బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు
.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.