Categories: EntertainmentLatest

Kiara-Siddarth Wedding : పర్మనెంట్ బుకింగ్ అయిపోయిందంటున్న బాలీవుడ్ క్రేజీ లవ్ బర్డ్స్..నెట్టింట్లో వైరల్ అవుతున్న వెడ్డింగ్ పిక్స్

Kiara-Siddarth Wedding : బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ కియారా అద్వానీ, ‌హ్యాండ్‌సమ్‌ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో వీరి వివాహం అత్యంత ప్రైవేట్ గా జరిగింది. కొన్నేళ్లుగా ఈ జంట రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ముంబై మీడియాలో, సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో గాసిప్స్ వచ్చేవి. ఈ జంట ఎక్కడ కనిపించినా ఫోటోగ్రాఫర్లు వారి కెమెరాలకు పనిచెప్పేవారు. వారి రిలేషన్‌షిప్ గురించి అడిగేవారు. కానీ ఈ జంట ఎప్పుడూ తమ రిలేష్ గురించి ఎక్కడా కూడా మాట మాట్లాడలేదు. గత వారం రోజులుగా త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వచ్చాయి. అయితే కొంతమంది అవన్నీ గాసిప్స్ అని కొట్టిపడేశారు. కానీ తాజా పెళ్లి కూడా అత్యంత సీక్రెట్ గా కొద్దిమంది బంధువులు, స్నేహితుల నడుమ చేసుకున్నారు ఈ లవ్ బర్డ్స్.

kiara-siddarth-wedding-kiara-and-siddarth-tie-knot-wedding-pics-viral

ఈ జంట కలిసి నటించిన మొదటి చిత్రం షేర్షా. 2021లో రిలీజ్ అయిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కరోనా మూమెంట్‌లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి విమర్శకులు సైతం ప్రశంసలు అందించారు. అయితే ఈ చిత్రంలో ఈ ఇద్దరి స్టార్ల కెమెస్ట్రీ ఎంతో బాగుందని అప్పట్లోనే అనేక కామెంట్లు వచ్చాయి. మూవీ చిత్రీకరణ సమయంలో వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉన్నారు. అప్పటి నుంచి వీరి రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతోంది. కానీ ఎప్పుడూ వీరి లవ్ విషయం ఎక్కడా రివీల్ చేయలేదు. పెళ్లి పీటలు ఎక్కేవరకు పక్కా ప్లాన్‌తోనే ఉంది ఈ జంట.

kiara-siddarth-wedding-kiara-and-siddarth-tie-knot-wedding-pics-viral

తాజాగా ఈ న్యూ కపుల్ తమ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలలో పెళ్లికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసి అభిమానులను ఖుషీ చేసింది. వివాహ సమయంలో దిగిన క్యాండిడ్ ఫోటోలను షేర్ తమ సంతోషాన్ని ఫ్యాన్స్‌తో ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. తమ వివాహాన్ని అధికారికంగా ప్రకటించారు. కియారా, సిద్దార్ధ్‌ లు పెళ్లి వేడుకలకు సంబంధించిన నాలుగు ఫోటోలను షేర్ చేసి ఇక మాది పర్మనెంట్ బుకింగ్ అయిపోయిందని ఆ పిక్స్‌కు క్యాప్షన్‌ను జోడించారు. ఇక మా వైవాహిక ప్రయాణం సాఫీగా సాగేందుకు మీ ఆశీర్వాదాలు, ప్రేమ మా జంటకు కావాలని పేర్కొన్నారు.

kiara-siddarth-wedding-kiara-and-siddarth-tie-knot-wedding-pics-viral

పెళ్లి కోసం కియారా మనీష‌ మల్హోత్రా డిజైన్ చేసిన అందమైన లెహెంగాను వేసుకుంటే సిద్దార్ధ్‌ షరారా సెట్ ను ధరిచాడు. ఈ వెడ్డింగ్ డ్రెస్ లో ఈ లవ్ బర్డ్స్ ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకునే క్యూట్ మూమెంట్స్ అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి.

kiara-siddarth-wedding-kiara-and-siddarth-tie-knot-wedding-pics-viral

గతంలో షేర్షా రిలీజ్ సందర్భంగా చేసిన ప్రమోషన్ లో కియారాను పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు ఆమె క్రేజీ సమాధానం చెప్పి అందరిని ఆకట్టుకుంది. ప్రేమ కోసం మాత్రమే పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది. జీవితంలో పెళ్లికి నా కారణం అది ఎప్పుడు జరిగినా ప్రేమే అయ్యి ఉంటుందని పేర్కొంది. ఎందుకంటే మీ జర్నీలో ఎలాంటి సమస్యలు వచ్చినా, ప్రేమ అనేది ఎప్పుడూ బలమైన పునాదిగా ఉంటుందని అదే కాపాడుతుందని తెలిపింది. ఈ ఇంటర్వ్యూ వీడియో కూడా ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

1 day ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

1 day ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

3 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

4 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

4 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

5 days ago

This website uses cookies.