Kiara Advani : వైలెంటైన్ డే రోజు తమ హల్దీ పిక్స్ ను నెట్టింట్లో పోస్ట్ చేసి తమ ప్రేమను వ్యక్తం చేశారు బాలీవుడ్ కొత్త జంట కియారా అద్వానీ, సిద్దార్ధ్ మల్హోత్ర.పసుపు దుస్తులలో అత్యంత సరదాగా వధువుగా కియారా వరుడుగా సిద్దార్ధ్‌లు క్రేజీ పోజులు ఇచ్చి ఫోటో షూట్ చేసిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తమ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ యంగ్ కపుల్ తమ హల్దీ పిక్స్ ను పోస్ట్ చేశారు. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో కొత్త జంట పసుపు రంగు సాంప్రదాయ దుస్తులలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.
కియారా అద్వానీ , సిద్ధార్థ్ మల్హోత్రాల హల్దీ వేడుక ఫిబ్రవరి 5 న జరిగింది. అనంతరం ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో నటీనటులు వివాహం చేసుకున్నారు. ఈ జంట వేదిక వద్ద ఒకరినొకరు పట్టుకున్న పిక్స్ అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. వీరిద్దరూ ప్రముఖ ఫ్యాష్ డిజైనర్ బాలీవుడ్ ఫేవరేట్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులను ధరించారు. కియారా పసుపు రంగు దుపట్టాతో తెల్లటి లెహంగా ధరించగా, సిద్ధార్థ్ పసుపు రంగు కుర్తాతో ప్రింటెడ్ శాలువను భుజాన వేసుకున్నాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో, ఈ జంట తమ హల్దీ పిక్స్ ను పోస్ట్ చేసి “ప్యార్ కా రంగ్ చద్దా హే ” అని క్యాప్షన్‌ను జోడించారు. అదే విధంగా రెడ్ హార్ట్ ఎమోజీని కూడా జోడించారు. ఈ పిక్స్ చూసిన అభిమానులు రెడ్ హార్ట్ ఏమోజీలను పోస్ట్ చేసి వారి వైవాహిక జీవితానికి మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.
కియారా అద్వానీ రాజస్థాన్ గోల్డెన్ అవర్‌లో రంగులు అద్దిన దుపట్టాతో ఉత్కంఠభరితమైన తెల్లని లెహంగాలో ప్రకాశవంతమైన వెలుగులో అత్యద్భుతంగా కనిపించింది.ఈ అవుట్ ఫిట్‌కు తగ్గట్లుగా ప్రియాంక ధరించిన రెండు నెక్లెస్‌లు దానికి సెట్ గా ఇయర్ రింగ్స్ ను అలంకరించుకుని టాక్ ఆఫ్‌ది టౌన్ గా మారింది. కియారా అద్వానీ మినిమల్ మేకప్‌తో, బ్రైడల్ గ్లోతో అత్యద్భుతంగా కనిపించింది.
ఫిబ్రవరి 7న అత్యంత వైభంగా కొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్యలో వివాహం చేసుకున్న తర్వాత ఈ నటీనటులు వారం రోజుల పాటు సంబరాలు చేసుకున్నారు. ఫిబ్రవరి 9న కుటుంబ సభ్యులు , సన్నిహితుల కోసం ఢిల్లీలో రిసెప్షన్‌ని నిర్వహించి, ఫిబ్రవరి 11న ముంబైకి తిరిగి వచ్చారు.ఫిబ్రవరి 12న, ముంబైలోని సెయింట్ రెగిస్ హోటల్‌లో రిసెప్షన్‌ను నిర్వహించారు. అక్కడ బాలీవుడ్ చలనచిత్ర పరిశ‌్రమకు చెందిన నటీనటులు, సెలబ్రిటీలు హాజరయ్యారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.