Kiara Advani: యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటించిన ‘వార్ 2’ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో, ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో హీరోయిన్‌గా నటిస్తున్న కియారా అద్వానీ గ్లామరస్ బికినీ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఆమె అందంపై ఫ్యాన్స్ ఫిదా అవుతుండగా, విమర్శకుల నుంచి మాత్రం ట్రోలింగ్ ఎదురైంది.
‘వార్ 2’ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన ఓ సాంగ్‌లో కియారా అద్వానీ బికినీలో కనిపించారు. ఈ ఫోటోలు, వీడియోలు ఒక్కసారిగా ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. ఆమె ఫిట్‌నెస్, అద్భుతమైన ఫిజిక్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తుంటే, కొందరు నెటిజన్లు మాత్రం ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ లుక్ నిజం కాదని, గ్రాఫిక్స్ (CGI) లేదా ఇతర ఎడిటింగ్ టూల్స్ ఉపయోగించి సృష్టించారని కామెంట్లు చేశారు. కొందరైతే దీపికా పదుకునే బికినీ లుక్‌లతో పోల్చుతూ మీమ్స్, ఫన్నీ పోస్టులు క్రియేట్ చేశారు.
ఈ విమర్శలు, ప్రచారానికి చెక్ పెడుతూ, కియారా న్యూట్రిషనిస్ట్ నికోల్ లిన్‌హారెస్ కేడియా స్పందించారు. కియారా ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటో ఆమె వివరించారు. కియారా తన డైట్ విషయంలో చాలా క్రమశిక్షణతో ఉంటారని, రోజూ కఠినమైన వర్కౌట్స్ చేస్తారని చెప్పారు. ముఖ్యంగా ఆమె తినే ఆహారం ఎంతో జాగ్రత్తగా తయారు చేయబడుతుందని, వంటకు వాడే నూనె నుంచి, తీసుకునే చీజ్ వరకు ప్రతీది ప్రత్యేకంగా ఎంపిక చేస్తారని తెలిపారు. ప్రోటీన్ అధికంగా ఉండే ఓట్స్, వాల్‌నట్స్ వంటి పోషకాలను తన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆమె ఫిజిక్ స్టిఫ్‌గా, అందంగా ఉంటుందని చెప్పారు. ఈ వివరణతో “సీజీ బికినీ ఫోటోలు” అనే ప్రచారం తగ్గింది. కియారా క్రమశిక్షణ, సరైన డైట్ వల్లే ఈ ఫిజిక్ సాధ్యమైందని నెటిజన్లు కూడా అంగీకరించారు.
కియారా గ్లామర్ ట్రీట్‌మెంట్ ‘వార్ 2’ సినిమాకు పాజిటివ్ హైప్ తెచ్చిపెట్టింది. సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ గ్లామర్ తో పాటు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల యాక్షన్ సీక్వెన్సులు కలిసి సినిమాకు మంచి విజయాన్ని అందిస్తాయని ఆశిస్తున్నారు. గర్భంతో ఉన్న కారణంగా కియారా ప్రమోషన్లకు దూరంగా ఉన్నప్పటికీ, ఆమె ఈ బికినీ లుక్ సినిమాపై అదనపు క్రేజ్ తెచ్చిపెట్టింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…
This website uses cookies.