Keerthi Suresh : మహానటి సినిమా తరువాత కీర్తి సురేష్ రేంజ్ మారిపోయింది. అప్పటి వరకు కీర్తికి నటనే రాదన్న వారు ఇప్పుడు ఆమెను మహానటి అని మెచ్చుకుంటున్నారు. తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో దాదాపు స్టార్ హీరోలందరితో నటించి, తనదైన వైవిధ్యమైన నటనతో అందంతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది కీర్తి సురేష్. బాలీవుడ్ నుంచి ఆఫర్లు అందివచ్చినా సౌత్‌కే పరిమితమై ప్రస్తుతం కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ తన సినీ కెరీర్‌ను కొనసాగిస్తోంది.
అయితే గత కొన్ని సంవత్సరాలుగా, నటి కీర్తి సురేష్ వివాహం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నటి త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోందని తన చిన్ననాటి ఫ్రెండ్ ని లవ్ మ్యారేజ్ చేసుకోబోతోందన్న పుకార్లు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.
గత సంవత్సరం, కీర్తి సురేష్ వివాహం గురించి ఇదే విధమైన పుకారు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశవ్యాప్తంగా ఆమె అభిమానులను ఒక్కసారిగా అవాక్కయ్యారు. గతంలో ఈ 29 ఏళ్ల బ్యూటీ కోలీవుడ్‌లో తన సంగీతంతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌తో కలిసి ఏడు అడుగులు వేయబోతోందన్న ఊహాగానాలు వ్యాపించాయి. అప్పడు, కీర్తి సురేష్ ఇది కేవలం గాసిప్ అని ఈ వార్తలో వాస్తతం లేదని కొట్టిపారేసింది. నా వివాహానికి సంబంధించిన పుకార్లు చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయని ఓ ఇంగ్లీషు పేపర్ ఇంటర్వ్యూలో పేర్కొంది, అసలు ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకొస్తాయోనని ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. నేను ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే, దాని గురించి చెప్పే మొదటి వ్యక్తిని నేనే అవుతాను అని చెప్పుకొచ్చింది. నా పెళ్లి గురించి ఊహాగానాలు మానుకోవాలని అందరినీ కోరుతున్నాను అని ఓ . నేను ఇప్పుడు నా పనిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించానని అప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పేసింది.
అయితే మరోసారి సోషల్ మీడియాలో కీర్తి పెళ్లి పుకార్లు మొదలయ్యాయి. తన చిన్ననాటి ఫ్రెండ్ ని లవ్ మ్యారేజ్ చేసుకోబోతోందన్న పుకార్లు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు కీర్తి సురేష్ తల్లి నటి మేనక కీర్తి పెళ్లిపై ఓ క్లారిటీ ఇచ్చింది. తన కూతురి పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లని అలాంటిది ఏమీ లేదని ఈ విషయాన్ని కండించింది మేనక. కీర్తి సురేష్ కూడా ఈ వార్తలపై ప్రజంట్ ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే కొంత మంది మాత్రం నిప్పులేనిదే పొగ రాదుకదా అని అంటుంటే మరికొందరేమో మూవీ ప్రమోషన్ కోసం ఇలాంటి గాసిప్స్ పుట్టిస్తున్నారని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
వృత్తిపరంగా, కీర్తి సురేష్ గత కొంత కాలంగా కమర్షియల్ చిత్రాలను చేస్తోంది. అందులో కొన్ని హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటే మరికొన్న ఫ్లామ్‌లను మూటగట్టుకున్నాయి. అయినా కూడా ఈ అమ్మడి దూకుడు తగ్గలేదు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తోంది ఈ బ్యూటీ. సమ్మర్ లో దసరా సినిమాతో థియేటర్స్‌లో సందడి చేయబోతోంది కీర్తి సురేష్. ఈ సినిమాలో మాస్ రోల్ ప్లే చేస్తోంది ముద్దుగుమ్మ. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది కాక కీర్తి సురేష్ సైరన్, రివాల్వర్ రీటా మంటి చిత్రాల్లో నటిస్తోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.