KCR Breakfast : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో నయా పథకాన్ని శ్రీకారం చుట్టారు. సర్కారి బడుల్లో చదువుకునే పిల్లలకు దసరా గిఫ్ట్ గా ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’ అనే సరికొత్త స్కీం ను ఇవాళ్టి నుంచి అమలు చేయబోతున్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితాఇంద్రారెడ్డి, ఫైనాన్స్ మినిస్టర్ హరీశ్‌రావు ఈ కొత్త పథకాన్ని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జడ్పీహెచ్‌ఎస్‌లో షురూ చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని వెస్ట్ మారేడుపల్లి గవర్నమెంట్ స్కూల్ లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని స్కూల్స్ లో మినిస్టర్లు , ఎమ్మెల్యేలు, ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు.
సీఎం బ్రేక్‌ఫాస్ట్’ అనే సరికొత్త స్కీం లో భాగంగా ప్రతీ స్కూల్‌లో ఉదయం 8 గంటల నుంచే బ్రేక్ ఫాస్ట్ విద్యార్థులకు అబదిస్తారు. ఇలా వారంలో ఆరో రోజుల పాటు పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ పెడతారు .
మరి బ్రేక్ ఫాస్ట్ మెనూ ఎలా తయారు చేశారో చూద్దాం..
సోమవారం: ఇడ్లీ సాంబార్/ గోధుమ రవ్వ ఉప్మా
మంగళవారం: పూరి/ టమాటా బాత్,
బుధవారం: ఉప్మా,సాంబార్/ కిచిడీ
గురువారం: మిల్లెట్ ఇడ్లీ / పొంగల్
శుక్రవారం: ఉగ్గాని/ పోహా/మిల్లెట్ ఇడ్లీ,కిచిడీ, చట్నీ
శనివారం: పొంగల్/వెజ్ పలావ్
సర్కారి బడుల్లో చదువుతున్న పిల్లలకు ప్రతీ రోజూ పోషకాలతో కూడిన ఆహారం అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసున్నారు. ప్రతి రోజు బ్రేక్ ఫాస్ట్ కి 45 నిమిషాల టైం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ప్రతీ స్కూల్ ఉదయం 8.45 గంటల నుంచి మొదలై.. మధ్యాహ్నం 3.45 గంటలకు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో స్కూల్ మొదలయ్యే 45 నిమిషాలు ముందుగా విద్యార్థులకు అల్పాహారం అందిస్తారు. చిన్నారుల ఆరోగ్యాన్ని మెరుగు పరచలానే కేసీర్ సర్కార్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. అంతే కాదు ఈ బ్రేక్ ఫాస్ట్ పథకం అమలులోకి వస్తే.. విద్యార్థులు డుమ్మా కొట్టకుండా స్కూల్ కి వస్తారని, డ్రాపౌట్‌లు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
సీఎం ‘అల్పాహారం’ పథకాన్ని రాష్ట్రంలోని 27,147 స్కూల్స్ లో అమలు చేస్తున్నారు.అంటే 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. అందుకే విద్యార్థులు స్కూళ్ల ప్రారంభానికి అరగంట ముందే బడులకు వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలతోపాటు మహబూబ్‌నగర్ జిల్లాల్లోని స్కూల్స్ లో అక్షయపాత్ర సంస్థ అల్పాహారాన్ని అందజేయనుంది. మిగతా జిల్లాల్లో మధ్యాహ్న భోజన కార్మికులు అందజేస్తారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.