Kasturi Shankar : బికినీ ఫోటోలు పంపినా ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదు..చివరికి ఏం జరిగిందంటే..

Kasturi Shankar : సీనియర్ నటి కస్తూరి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. అన్నమయ్య, పెద్దరికం, భారతీయుడు వంటి హిట్ సినిమాల్లో నటించి తన నటనతో ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తన సహజసిద్ధమైన Kasturi Shankar : సీనియర్ నటి కస్తూరి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. అన్నమయ్య, పెద్దరికం, భారతీయుడు వంటి హిట్ సినిమాల్లో నటించి తన నటనతో ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తన సహజసిద్ధమైనయాక్టింగ్‏తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. దక్షిణ భారత్‎లో దాదాపు అన్ని భాషల్లోనూ మంచి సినిమాలు చేసిన అనుభవం కస్తూరికి ఉంది. ఈమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నటనలోనే కాదు రియల్ లైఫ్ లోనూ ఇమె ముక్కుసూటి మనిషి ఏ విషయంపైనా మాట్లాడాలనుకుంటూ నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. ఇండస్ట్రీలో తనకు ఏదైనా నచ్చలేదంటే ఓపెన్ గానే తన ఓపీనియన్ చెప్పే గట్స్ కస్తూరికి ఉన్నాయి. ఆమె చేసే కామెంట్స్ కూడా ఒక్కోసారి భారీగానే వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం కస్తూరి ‘ఇంటింటి గృహలక్ష్మి’ అనే సీరియల్ చేస్తోంది. తులసి క్యారెక్టర్ లో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది.

మోడల్‌గా, యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్‌గా పలు చిత్రాల్లో యాక్ట్ చేసి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తోంది నటి కస్తూరి శంకర్. ఈమె అసలు పేరు సుమతి శంకర్. లా వరకు చదువుకున్నా నటన మీద ఉన్న ఆసక్తితో సినీరంగంవైపు అడుగులు వేసింది. తమిళ, తెలుగు, మళయాళం,కన్నడ భాషల్లో ఈమె నటించింది. 1992లో మిస్ చెన్నైగా కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా కాంపిటీషన్ లోనూ ఫైనల్ వరకు వెళ్లింది. కెరియర్ మంచి పీక్‌లో ఉన్నటైంలోనే కొన్ని రూమర్స్ కారణంగా కస్తూరి పేరెంట్స్ ఆమెకు పెళ్లి చేశారు. ఈ క్రమంలో తాజాగా చేసిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‏లో ఎదుర్కున్న అనుభవాలను పంచుకుంది కస్తూరి.

kasturi-shankar-i-sent-bikini-photos-to-director-but-he-did-not-accepted

” శంకర్ లాంటి డైరెక్టర్‎తో పనిచేయడం ఎంత అదృష్టమో అప్పట్లో నాకు తెలిసింది. అప్పుడు వయసులో నేను చాలా చిన్నదానిని. ఏదో సరదాగా ఆ సినిమా చేసేశాను. కమల్ హాసన్ నటించిన హిట్ మూవీ భారతీయుడులో హీరోయిన్ ఛాన్స్ ఫస్ట్ నాకే వచ్చింది. అప్పట్లో ఎలాగైనా ఆ ఆఫర్ అందుకోవాలని తెగ ట్రై చేశాను. ఆ సినిమా విషయంలో సంప్రదింపులు జరుగుతున్న సమయంలోనే డైరెక్టర్ కి బికినీ ఫోటోలు పంపించాను.

kasturi-shankar-i-sent-bikini-photos-to-director-but-he-did-not-accepted

కానీ బ్యాడ్ లక్ నా వెంటే ఉంది. ఈ సినిమా స్టార్ట్ అయ్యే సమయంలోనే రంగీలా మూవీ విడుదలైంది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసింది. దీంతో ఎవరి నోట విన్నా ఊర్మిళ పేరే వినిపించింది. దీంతో భారతీయుడు ఫిల్మ్ మేకర్స్ దృష్టంతా ఆమె వైపు వెళ్ళింది. దీంతో ఊర్మిళను ఈ మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. నాకు మాత్రం కమల్ హాసన్ చెల్లి క్యారెక్టర్ ఇచ్చి సరిపెట్టేశారు. అలా హీరోయిన్ కావాల్సిన నేను భారతీయుడికి కూతురిగా నటించాను. కొన్నాళ్ల తర్వాత ఏంటి సర్ ఇలా చేశారు..? అని శంకర్ ని అడిగితే.. మూవీలో ఇదొక కీలకమైన పాత్ర అని చెప్పారు. దీంతో నేను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను” అని కస్తూరి భారతీయుడు సినిమా అనుభవాలను పంచుకుంది.

Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

1 day ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

1 day ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

3 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.