Karate Kalyani : బెంగళూరు శివారులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తోంది. సీనియర్ నటి హేమ ఈ పార్టీకి వచ్చినట్లు బెంగళూరు పోలీసు కమిషనర్ దయానంద్ క్లారిటీ ఇవ్వడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు రేవ్ పార్టీతో తనకేమీ సంబంధం లేదని నిరూపించేందుకు హేమ తప్పుడు ప్రచారానికి దిగారని దయానంద్ తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో హేమపై నెట్టింట్లో ట్రోల్స్ మొదలయ్యాయి. ఇదే క్రమంలో హేమపై నటి కరాటే కళ్యాణి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రేవ్ పార్టీకి వెళ్లిన వారిని కర్రపట్టుకుని రేవు పెట్టేయాలని మాట్లాడింది. అంతే కాదు హేమని మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ నుంచి సస్పెండ్ చేస్తున్నామని కూడా బాంబ్ పేల్చింది.
మీడియాతో నటి కరాటే కళ్యాణి మాట్లాడుతూ..”నేను ‘మా’ జాయింట్ సెక్రటరీగా మాట్లాడుతున్నా. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. అది ఆడవాళ్లు అయినా మగ వాళ్లు అయినా.. తప్పు తప్పే. ఈ రేవ్ పార్టీలకు వెళ్లేవారిని రేవు పెట్టాలి. విచ్చలవిడిగా డ్రగ్స్ వాడుతూ పిచ్చి పిచ్చి వేషాలులు వేస్తున్నారు. రూ.60 లక్షలు పెట్టి రేవ్ పార్టీలు నిర్వహించడం ఏంటండీ. అంతలా ఎంజాయ్ చేయాలంటే..కుటుంబంతో వెళ్లొచ్చు కదా. తాగడం, తూగడం ఇవేం పార్టీలు. మన సంస్కృతిని నాశనం చేస్తున్నారు. ఏది జరిగినా ఇండస్ట్రీని అంటున్నారు. ఇలాంటి వాళ్లు వల్ల మొత్తం తప్పు ఇండస్ట్రీ చేసిందని అంటున్నారు. నాకు డ్రింక్స్ అలవాటు లేదు. ఇండస్ట్రీలో నాలాంటి వాళ్లు చాలామందే ఉన్నారు. మేము నటులుగా తాగుబోతు క్యారెక్టర్లు చేస్తాం కానీ తాగం. కానీ మేము తాగుబోతులం అని మాపై ముద్ర వేసేస్తుంటారు. ఇండస్ట్రీ వాళ్లంతే అని ఈజీగా అనేస్తుంటారు. ఇప్పుడు హేమ దొరికింది. ఆమెతో పాటు చిన్న చిన్న ఆర్టిస్ట్‌లు ఉన్నారు.
ముందు హీరో శ్రీకాంత్, జానీ మాస్టర్, హేమలు రేవ్ పార్టీలో ఉన్నట్టు న్యూస్ విన్నాం. కానీ.. శ్రీకాంత్ గారు, జానీ మాస్టర్ అతందా ఫేక్ అని క్లారిటీ ఇచ్చారు. అక్కడ ఉంది హేమ మాత్రమే. మిగిలిన ఇద్దరు లేరు. హేమ తనంతట తానే బుక్కైపోయింది. ఆమెకు వాగుడు ఎక్కువ. తన వెకిలిచేష్టలతో ఇలా అడ్డంగా బుక్కైంది. ఆమెను చూస్తుంటే పాపం జాలేస్తుంది. పరీక్షల్లో హేమ డ్రగ్స్ తీసుకున్నట్టుగా రాకూడదని నేను కోరుకుంటున్నా. ఆమెకి మంచి జరగాలని కోరుకుంటున్నా. ఈ విషయంలో ఇండస్ట్రీ పరంగా ఆమెకు శిక్ష ఉంటుంది. ఎవ్వరైనా రూల్ ప్రకారం శిక్షార్హులే. హేమని ఇండస్ట్రీ నుంచి సస్పెండ్ చేస్తారు. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌లో ఆమె మెంబర్ కాబట్టి.. ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది” అంటూ కళ్యాణి ఓ రేంజ్‌లో హేమకు ఇచ్చిపడేసింది.
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.