kapu-community-unite-for-pawan-kalyan
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో తనదైన పంథాలో ముందుకి వెళ్తున్నాడు. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా బలమైన స్థానాలలో గెలవాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ ఆ దిశగా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. రాబోయే ఎన్నికలలో గెలిస్తే ప్రజా ప్రస్థానంలో సుదీర్ఘంగా రాజకీయాలు చేయగలమని పవన్ కళ్యాణ్ కూడా భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆ దిశగా తన అడుగులు వేస్తున్నారు. వైసీపీని గద్దె దించడంతో పాటు అధికారంలో భాగస్వామ్యం కావాలని భావిస్తున్నారు. దానికోసం అవసరం అయితే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఈ పొత్తులతో కచ్చితంగా అధికారంలోకి రావొచ్చని భావిస్తున్నారు.
అయితే టీడీపీని జనసేన ఎక్కువ స్థానాలు డిమాండ్ చేయడంతో పాటు ముఖ్యమంత్రి అధికారంలో భాగస్వామ్యం కూడా కోరుకుంటున్నారు. దానికి టీడీపీ సిద్ధంగా లేదు. అయితే ఓ వైపు టీడీపీతో పొత్తు రాజకీయాలు నడుపుతూనే గ్రౌండ్ లెవల్ లో క్యాడర్ ని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సభ్యుత్వ నమోదు కార్యక్రమం ద్వారా జనసేన బలం గ్రామీణ స్థాయిలో ఎంత ఉంది అనేది ఒక అంచనాకి రావొచ్చు. ఈ రెండు జరిగిన తర్వాత వారాహియాత్రకి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సీనియర్ నేత హరిరామజోగయ్య కాపు సామాజికవర్గాన్ని సమీకృతం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ద్వారా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అవకాశం కాపులకి వస్తుందని, దీనికి ఈ సారి బలంగా ఉపయోగించుకోవాలని కాపు నాయకులకి పిలుపునిస్తున్నారు. అయితే వైసీపీలో ఉన్న కాపులు మాత్రం ఎట్టి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాకుండా ఆపాలని ప్యాకేజీకి అమ్ముడుపోయాడు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిపై హరిరామజోగయ్య కాపు రిజర్వేషన్ అంశాన్ని పట్టుకొని వైసీపీని ఇరుకున పెట్టె ప్రయత్నం చేస్తున్నారు.
దాని ద్వారా కాపులలో ఐక్యత పెంచి జనసేనకి బలమైన ఓటుబ్యాంకుగా మార్చవచ్చని భావిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే ఉదయగోదావరి జిల్లాలలో కాపు సంఘాల సమావేశాలు రెగ్యులర్ గా జరుగుతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ కాపు ఓటుబ్యాంకు, రాజ్యాధికారం దిశగా పవన్ కళ్యాణ్ కి వారు ఎంత వరకు మద్దతుగా నిలబడతారు అనేది చూడాలి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.