Kantara Teaser : కాంతారావు ఈ పేరు చెప్పగానే గూస్ బమ్స్ వస్తాయి. ఎలాంటి ఎస్టిమేషన్ లేకుండా వచ్చి సెన్సేషన్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. భూతకోల నేపథ్యంలో సాగిన ఈ మూవీ ఆల్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది. అతి తక్కువ పెట్టుబడితో రూపొందించిన ఈ మూవీ భారీ వసూళ్లను రాబట్టి బీభత్సం సృష్టించింది. హీరోగా డైరెక్టర్ గార రిషబ్ శెట్టి క్రియేట్ చేసిన ఈ మ్యాజిక్ ను ఎవరు ఇప్పటికి మర్చిపోలేదు. కాంతారా ప్రీక్వెల్ కోసం గత కొంతకాలంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
కాంతారా సినిమా రిలీజ్ అయిన కొత్తలో చాలామంది మూవీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అనుకరించి.. సినిమాకు ఓ రేంజ్ లో మౌత్ పబ్లిసిటీ ఇచ్చారు. కథ, కాన్సెప్ట్ కొత్తగా ఉండడంతో తెలుగు ప్రేక్షకులంతా ఈ మూవీ కి ఫిదా అయ్యారు.మొదట కన్నడ ఇండస్ట్రీ లో బ్లాక్‍బాస్టర్ అయిన కాంతారా ఆ తర్వాత తెలుగు, హిందీ సహా విడుదల అయిన అన్ని భాషల్లో బంపర్ హిట్ అయింది. భారీ కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలను సైతం దక్కించుకుంది. కాంతార మూవీ హిట్ తో కన్నడ పరిశ్రమ వైపు అందరి దృష్టి మళ్ళింది. ఇప్పుడు కాంతార సినిమాకు ప్రీక్వెల్‍గా ‘కాంతార చాప్టర్ 1’ వస్తోంది. ‘కాంతార – ఏ లెజెండ్ చాప్టర్ 1’ మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ తాజాగా విడుదల అయ్యింది. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ఈ టీజర్ ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. ఆడియన్స్ లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.
టీజర్ లో రిషబ్ శెట్టి లుక్ బీభత్సంగా ఉంది. కండలు తిరిగిన దేహంతో చాలా డిఫరెంట్‍గా కనిపించాడు. శరీరం మొత్తం రక్తపు మరకలు, మెడలో రుద్రాక్ష మాలలు , ఓ చేతిలో త్రిశూలం, మరో చేతిలో గొడ్డలి, పొడవాటి జుట్టు, గడ్డంతో రిషబ్ లుక్ అందరిని ఆకట్టుకుంటోంది. టీజర్ లోనే కథను రివీల్ చేశారు మేకర్స్. కదంబల జన్మించిన ఓ లెజెండ్ కథగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫ్రీక్వల్ కథకు కూడా హీరో రిషబ్ శెట్టినే రూపకర్త. అంతేకాదు దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. హొంబాలే ఫిల్స్మ్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ మూవీని ప్రొడ్యూజ్ చేస్తున్నారు. అజ్నిశ్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చాప్టర్ 1 మూవీని కన్నడతో పాటు ఒకేసారి తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.