Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ కు ఇంట్రడక్షన్ అవసరం లేదు. టాపిక్ ఎలాంటిదైనా, ముందుంది ఎంతటి వారైనా భయపడకుండా, ఎలాంటి బెరుకు లేకుండా తన అభిప్రాయాన్ని తెలిపి వారిని ఎదురిస్తుంది. బాలీవుడ్ లో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. సినిమా నుంచి పొలిటికల్ వరకు ప్రతి అంశంపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్పడంలో కంగనా వెనుకడుగు వేయదు. ఇండస్ట్రీలోనూ చాలా మంది కంగనా బాధితులు ఉన్నారు. బాలీవుడ్ క్వీన్ బాలీవుడ్ కు చెందిన ప్రముఖ డైరెక్టర్ భార్యపై ఘాటైన వ్యాఖ్యలు చేసి ఆమెపై విరుచుకుపడింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి.
బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా 12th ఫెయిల్ అనే సినిమా తీశారు. ఈ మూవీ బాలీవుడ్ బ్లాక్సాఫీస్ ను కొల్లగొడుతోంది. బ్లాక్ బస్టర్ హిట్ తో దూసుకుపోతోంది. విమర్షకుల ప్రశంసలను సైతం అందుకుంటోంది. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ రేసులోకి కూడా వెల్లబోతోంది. అయితే ఈ క్రమంలో డైరెక్టర్ భార్య ఈ సినిమాను థియేటర్ లో కాకుండా ఓటీటీలో విడుదల చేయాలని ప్రముఖ జర్నలిస్ట్ అనుపమ చోప్రా సలహా ఇచ్చిందట. ఈ విషయం తెలుసుకున్న కంగనా అగ్గిమీదగుగ్గిలం అయ్యింది. డైరెక్టర్ భార్యాపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. “విధు వినోద్ చోప్రా సర్ మీ భార్య అనుపమ చోప్రా సినీ జర్నలిజం రంగానికి అప్రతిష్ట. ఆమె జెనోఫోబియాను చూపించడమే కాకుండా ప్రతిభావంతులైన యువ మహిళలపై ఆమెకు తీవ్రమైన అసూయ వచ్చింనట్లుంది. ఆమె తన భర్తను చూసి అసూయపడటంలో ఎలంటి సర్ప్రైజ్ లేదు. తన వెబ్‌సైట్ ను ఇతర బిజినెస్ లను కంటిన్యూ చేయడానికి మీ పేరును, ప్రాపర్టీని వాడుకుంటోంది. అసలైన టాలెంట్ కు , మంచి మూవీస్ కు ఆమె వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. బాలీవుడ్‌లోని కొన్ని గాసిప్ సర్కిల్స్‌తో ఆమె కలిసి వర్క్ చేస్తోంది. తనను తాను సరిదిద్దుకోవడానికి మీ భార్య బాలీవుడ్ వైఫ్ కార్డ్ సినిమా మీటింగుల్లో వాడుకుంటోంది” అని కంగనా అనుపమ చోప్రాపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది.
కంగనా చేసిన కామెంట్స్ పై ప్రస్తుతం నెట్టింట్లో తీవ్ర చర్చలకు దారితీశాయి. ఈ మధ్యనే తేజస్ తో ముందుకొచ్చిన కంగనా అది డిజాస్టర్ కావడంతో మరో మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. లేటెస్టుగా ఈ భామ ‘ఎమర్జెన్సీ’ సినిమాలో నటించింది. త్వరలో ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో తన లాస్ట్ మూవీ తేజస్ పై అనుపమ్ చోప్రా నెగెటివ్ సమీక్షలు రాసింది. ఈ మూవీనే కాదు కంగనా నటించిన చాలా వరకు చిత్రాలపై డైరెక్టర్ భార్య ప్రతికూల సమీక్షలు రాసారు. దీంతో ఒళ్లు మండిన కంగనా సమయం రావడంతో నెట్టింట్లో ఓ రేంజ్ లో డైరెక్టర్ భార్యపై విరుచుకుపడింది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.