Categories: EntertainmentLatest

Kalki : ఏంటి కల్కి ఆ సినిమాకు కాపీనా?

Kalki : సలార్ సాలిడ్ హిట్ తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ కల్కీ2898AD.మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రిలీజ్ కు ముందే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ అశ్వధ్దామ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఇక విశ్వనటుడు లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్‌ కూడా ఈ సినిమాలో భాగం అవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకోణె, దిశాపటానీలు ప్రభాస్ కు జోడీగా కనిపించినున్నారు. అంతే కాదు టాలీవుడ్ స్టార్ యాక్టర్ రానా ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు సమాచారం. రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కీ తెరకెక్కుతోంది. అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

kalki-is-directer-nag-ashwin-copied-dune-moviekalki-is-directer-nag-ashwin-copied-dune-movie
kalki-is-directer-nag-ashwin-copied-dune-movie

సినిమాకు సంబంధించి వస్తున్నఅప్డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా మేకర్స్ కల్కీ నుంచి అమితాబ్ లుక్ ను రివీల్ చేశారు. మేకర్స్ విడుదల చేసిన టీజర్ లో అమితాబ్ అశ్వత్ధామ క్యరెక్టర్ లో కనిపించారు. మహాభారతాన్ని ఈ లింక్ చేస్తూ తీశారని ఈ గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. దీంతో ప్రేక్షకుల్లో కల్కీపై అంచనాలు మరింతగా పెరిగాయి. అయితే ఇదే క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ఓ రూపర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ హాలీవుడ్ మూవీని కల్కీమేకర్స్ కాపీ కొట్టారని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా దీనిపై దర్శకుడు నాగ్ అశ్విన్ రియాక్ట్ అయ్యారు. ఈ రూమర్స్ ను కొట్టిపారేశారు.

kalki-is-directer-nag-ashwin-copied-dune-movie

ప్రపంచ వ్యాప్తంగా 2024 జూన్ 27 న కల్కీని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో అమితాబ్‌, ప్రభాస్‌ సహా దీపికా పదుకోణెలు ఓ ఎడారి ప్రాంతంలో ఉండడం కనిపిస్తోంది. దీంతో ఈ పోస్టర్ చూసిన వారంతా ఈ మూవీ హాలీవుడ్ “డూన్”కు కాపీ అనే ప్రచారం మొదలుపెట్టారు. ఇలాంటి సైన్స్ ఫిక్షన్ మూవీస్ కి డూన్ నవల ఎంతో స్ఫూర్తిగా నిలిస్తుందని చాలా మంది అభిప్రాయం . ఇక డూన్ నవల స్ఫూర్తితోనే నాగ్ అశ్విన్ కల్కీ తెరకెక్కిస్తున్నారని కొంత మంది నెటిజన్స్ వాదిస్తున్నారు. ఈ క్రమంలో కాపీ ఆరోపణలపై నాగ్ అశ్విన్ స్పందించారు.ఈ రూమర్స్ ను సింపుల్ గా కొట్టిపారేసారు. “డూన్ సినిమాలో ఇసుక అలాగే కల్కి మూవీలో ఇసుక కనిపించడం వల్ల రెండు సినిమాలు ఒకే విధంగా ఎలా ఉంటాయి. ప్రేక్షకులు ఈ రూమర్స్ ను నమ్మకండి”అని క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్.

Sri Aruna Sri

Recent Posts

Puranapanda Srinivas : అభయ గణపతి ఆలయదర్శనమే అమోఘం

Puranapanda Srinivas : హైదరాబాద్, మే 2: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని,…

2 days ago

PURANAPANDA SRINIVAS : పురాణపండకు త్యాగరాయ గానసభలో దక్కిన ఘనత!

PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…

3 weeks ago

Ram Charan: ఊహించని రేంజ్‌లో ‘పెద్ది’ ఫస్ట్ షాట్..’పుష్ప’ రికార్డ్స్ బద్దలు..!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…

4 weeks ago

Sreeleela: డార్జిలింగ్‌ లో యంగ్ హీరోయిన్‌కి చేదు అనుభవం..

Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్‌ ముగిసిన…

4 weeks ago

Nagababu : శ్రీరామచంద్రుని ‘ జయ జయ రామ ‘ ఆవిష్కరించడం అదృష్టం.

Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

4 weeks ago

Tollywood : రీ రిలీజ్‌లో ‘సలార్‌’తో నాని సినిమా పోటీ

Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…

2 months ago