Kalki 2898ad : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన సలార్ మూవీ సూపర్ డూపర్ హిట్ తర్వాత ప్రభాస్ జోరు పెంచాడు. ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ సలార్ మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమా ఏకంగా 700 కోట్లు వసూలు చేసి రికార్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాదు యువ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న కల్కి సినిమా అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ చేస్తున్నాడు. మిగతా సినిమాలకు భిన్నంగా కల్కీ ఉండబోతోంది . డైరెక్టర్ నాగ్ అశ్విన్ భారీ బడ్జెట్ తో కల్కీని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన టీజర్స్ అంచనాలను భారీగా పెంచుతున్నాయి. ఇప్పుడు మూవీకి సంబంధించి మరో అప్డేట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో భాగం కానున్నారని టాక్ వస్తోంది.
కల్కీ సినిమాను ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్. పాన్ ఇండియా సినిమా కావడంతో బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ ను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించనున్నారు. ఆయన క్యారెక్టర్ కు సంబంధించిన టీజర్ కూడా ఈ మధ్యనే విడుదలైంది. అలాగే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూడా ఈ మూవీలో కనిపించనున్నారు . ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనెతో పాటు దిశా పటాని నటిస్తుంది.
ఇక తాజాగా కల్కిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా భాగం కానున్నారని తెలుస్తోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఇప్పటికే మహేష్ బాబును కలిసినట్లు సమాచారం. కల్కిలో ప్రభాస్ విష్ణు అవతారంలో కనిపించనున్నాడట. ఈ క్రమంలో ప్రభాస్ ను ఇంట్రడ్యూజ్ చేసేందుకు మహేష్ బాబును రంగంలోకి దింపుతున్నారట నాగ్ అశ్విన్. ప్రభాస్ ఇంట్రో, ఎలివేషన్ కు ప్రిన్స్ తన వాయిస్ ఇవ్వనున్నారని టాక్. ఇదివరకే మహేష్ బాబు జల్సా, బాద్షా, ఆచార్య సినిమాలకు వాయిస్ ఇచ్చారు. తన గొంతుతో ఫ్యాన్స్ ను అలరించారు. ఇక ఇప్పుడు కల్కీలో ప్రభాస్ సినిమాకు మహేష్ వాయిస్ ఇవ్వనున్నారని సమాచారం. అయితే ఈ న్యూస్ నిజమా కాదా అన్నది తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే ఫ్యాన్స్ కు ఓ రేంజ్ పండగే.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.