Kalki 2898 AD : వరల్డ్వైడ్గా సినీ లవర్స్ ఎదురుచూస్తున్న మూవీ కల్కి. సలార్ సూపర్ హిట్ తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తోంది. భారీ యాక్షన్ సీన్స్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్, గ్లింప్స్ , అప్డేట్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. తాజాగా కల్కీ టీమ్ భైరవ బుజ్జిని పరిచయం చేసింది. డార్లింగ్ ప్రభాసే స్వయంగా బుజ్జిని అందరికి ఇంట్రడ్యూజ్ చేశాడు.
గత ఏడాది రిలీజైన ప్రభాస్ సలార్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అంతకు మించిన పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ తో కల్కి సినిమా రాబోతుంది. బుజ్జి ఎంట్రీతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. ప్రభాస్ లుక్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా కల్కి హీరోయిన్ దీపికపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆమెను తిట్టిపోస్తున్నారు.
బాలీవుడ్ లో టాప్ హీరోయిన దీపికా దీపికా పదుకోన్. ఈ బ్యూటీకి బీ టౌన్ లో ఓ రేంజ్ క్రేజ్ ఉంది. ఎంతో మంది టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ దీపికను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకున్నారు. ఎట్టకేలకు ఈ బ్యూటీ నాగ్ అశ్విన్ కల్కి మూవీకి ఓకే చెప్పింది. ఈ సినిమాలో దీపికా రోల్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక కల్కీ మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. దీంతో ప్రమోషన్స్ లో మేకర్స్, డైరెక్టర్, హీరో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే హీరోయిన్ దీపిక మాత్రం ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేయకపోవడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
నిజానికి దీపికా ప్రెగ్నెంట్ . అందుకే ఆమె బుజ్జి ప్రమోషన్ కార్యక్రమానికి రాలేకపోయింది. అయితే ఈవెంట్ కి రాలేకపోయినా కనీసం సోషల్ మీడియాలో అయినా కల్కీ కి సంబంధించి చిన్న పోస్ట్ అయినా పెట్టొచ్చు కదా అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. దీపికా తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఆమె నెట్టింట్లో కూడా ప్రచారం చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి సోషల్ మీడియాలో దీపికా పెద్దగా యాక్టివ్ గా ఉండదు. అయినా స్పెషల్ ఈవెంట్లు ఉంటే మాత్రం ఆ విషయాలను షేర్ చేస్తుంటుంది. ఆమె హాట్ ఫోటో షూట్ పిక్స్ కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తుంది. అయితే కల్కీ సినిమాలో లీడ్ రోల్ లో ఉన్నా సినిమా గురించి తన ఇంస్టాగ్రామ్ లో పెద్దగా ప్రచారం చేయడం లేదు. ఇప్పటి వరకూ కేవలం రెండు పోస్టులు మాత్రమే పెట్టింది. కల్కీ సినిమా మొదలైనప్పుడు, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు మాత్రమే పోస్టులు పెట్టింది. దీంతో కల్కి సినిమాపై దీపికా తీరుపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.ఇప్పటికైనా ప్రమోషన్స్ చేయండని కామెంట్లు పెడుతున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.