Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి సంబంధించిన పాత వీడియోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక వ్యవహారంలో సెలబ్రీటీలు అబాసుపాలవుతున్నారు. గతంలో చేసిన తప్పులన్నీ తవ్వకాల్లో బయటపడుతున్నాయి. ఇంట్లో వాళ్ళు వద్దన్నా డాన్స్ అంటే ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చి సీనియర్ నృత్య దర్శకుడు రాకేష్ మాస్టర్ దగ్గర శిక్షణ పొంది అసిస్టెంట్ గా స్టార్ హీరోల సినిమాలకి పనిచేస్తూ పరిచయాలు పెంచుకున్నాడు జానీ మాస్టర్.
అతి కొద్ది కాలంలోనే సౌత్ సినిమా ఇండస్ట్రీలలో స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగాడు. ప్రభుదేవా లాంటి సీనియర్ కొరియోగ్రఫీ అందించిన సాంగ్స్ కి కొంత సపోర్ట్ చేశాడు. ప్రస్తుతం జానీ మాస్టర్ తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాలలోని పాటలకి డాన్స్ కొరియోగ్రఫీ అందిస్తూ బిజీగా ఉన్నాడు. శేఖర్ మాస్టర్ కి గట్టి పోటీ ఇస్తున్నాడు. అంతేకాదు, తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కన్నడలో కిచ్చా సుదీప్, తమిళంలో విజయ్ లాంటి అగ్ర హీరోలకి జానీ మాస్టర్ బాగా దగ్గరయ్యాడు.
ఇప్పటి వరకూ కొరియోగ్రాఫర్ గా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో బిహేవియర్, క్యారెక్టర్ పరంగా అంత చెడ్డపేరునూ వెంట తెచ్చుకున్నాడు. అది ఢీ లో కంటెస్ట్ గా, ఆ తర్వాత జానీ మాస్టర్ వద్ద సహాయకురాలిగా పనిచేసిన శ్రష్ఠి అనే కొరియోగ్రాఫర్ బట్టబయలు చేసింది. ఆమె చెప్పిన విషయాలు చూసి ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అయింది.
ఇద్దరి కాంబినేషన్‌లో ‘యధారాజా తధాప్రజా’ సినిమా కూడా ప్రారంభమైంది. అది రిలీజ్ కాకుండా జానీ మాస్టర్ చేసిన నిర్వాకాలను బాదితురాలు బయటపెట్టి జానీ మాస్టర్ లోపలికి వెళ్ళేలా చేసింది. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నప్పటికీ జానీ మాస్టర్ వైపే అన్నీ వేళ్ళు చూపిస్తున్నాయి. ఇదే సమయంలో జానీ కి సంబంధించిన పలు వీడియోలు బయటకు వస్తున్నాయి. వీటిలో శ్రష్ఠి తో కలిసి చేసే సినిమా వీడియో, ఢీలో ఆయన అరిచి కేకలు పెట్టి మైక్ ఫ్లోర్ కి విసిరికొట్టిన వీడీయో లాంటివి ఉన్నాయి. మరి జానీ మాస్టర్ కెరీర్ ఎలా టర్న్ అవబోతుందో అని అందరూ ఎంతో ఆసక్తికరంగా చూస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.