Janhvi-Kushi Kapoor : దివంగత నటి అందాల తార శ్రీదేవి తన అందంతో, నటనతో సినీ ఇండస్ట్రీ ని దశాబ్దాలపాటు ఏలింది. సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అందరి మనసులను గెలిచింది. ఆమె లేని లోటును ఎవరూ తీర్చలేరు. ఆమె మరణం అనంతరం ఆమె వారసురాలుగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది.
ఇక శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ కూడా త్వరలో నటిగా గా ఎంట్రీ ఇవ్వనుంది. అయితే అందరూ భావించినట్టు బాలీవుడ్ లో కాదు ఈ భామ సౌత్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది. మరోవైపు అక్క జాన్వీ కూడా ఎంటీఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించ బోతోంది. దీనితో అక్కాచెల్లెళ్లు ఇద్దరూ సౌత్ పై దండయాత్ర చేయబోతున్నారు.
జాన్వీ కపూర్ ‘దఢక్’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత వరుసగా పలు సినిమాల్లో నటించింది. దాదాపుగా ఈ బ్యూటీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ వస్తుంది. అయితే జాన్వీకి ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేదు. ఇంకా స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి రాలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇస్తుంది. జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ కూడా అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించి స్టార్ హీరోయిన్ అవ్వాలని తన ప్రయత్నాలు తాను చేస్తోంది.
ఖుషి కపూర్ సినిమాలు చేయనప్పటికి ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. త్వరలో ‘ది ఆర్చీస్’ అనే మూవీ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. అంతేకాదు తాజాగా ఖుషి కపూర్ కు తమిళ్ ఆఫర్ వచ్చిందట. దీనితో త్వరలో సౌత్ ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళ యాక్టర్ అధర్వ రాబోయే సినిమాలో ఖుషి కపూర్ కనిపించునుందని సమాచారం. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.
దీనితో చెల్లి ఖుషి కపూర్ తమిళ సినిమాతో ఎంట్రీ ఇస్తే, అక్క జాన్వీ తెలుగులో సత్తా చాటేందుకు రెడీ అయ్యింది. మరి తమిళ్, తెలుగులో శ్రీదేవి స్టార్ హీరోయిన్ గా నిలబడినట్టే ఈ అక్కాచెల్లెళ్లు అవుతారా లేదో వెయిట్ చేసి చూడాల్సిందే.
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…
MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్ సాధించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కేవలం…
This website uses cookies.