Janasena: విశాఖ కేంద్రంగా వైసీపీ, జనసేన మధ్య గత మూడు రోజులుగా జరుగుతున్న రాజకీయ యుద్ధం ఏ స్థాయిలో నడిచిందో అందరూ చూసే ఉంటారు. న్యూస్ చానల్స్ నుంచి సోషల్ మీడియా వరకు, తెలుగు మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు జనసేన పవన్ కళ్యాణ్ నిర్బంధంకి సంబంధించిన వార్తలు టాక్ ఆఫ్ ది న్యూస్ గా మారిపోయాయి. నిజానికి పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు సార్లు జనవాణి కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఆ మూడు కార్యక్రమాలకి వైసీపీ నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదు. అలాగే మీడియా కవరేజ్ కూడా అనుకున్న స్థాయిలో లేదు. కేవలం జనవాణి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు మాత్రమే కాస్తా కవరేజ్ లో ఉండేవి.
అయితే విశాఖ వేదికంగా అక్టోబర్ 15న జనసేనాని జనవాణి నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. అప్పటికే వైసీపీ వికేంద్రీకరణ, మూడు రాజధానులు, విశాఖ పరిపాలన రాజధాని అనే అజెండాలతో ఉత్తరాంద్ర జేఏసీ అనేది కొంత మందితో కలిసి పెట్టించి దాని వెనుక ఉండి విశాఖ గర్జన నిర్వహించారు. దీనికోసం పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేశారు. అదే స్థాయిలో గర్జన ర్యాలీ, సభని నిర్వహించి విజయవంతం చేసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం అదే రోజు నిర్వహిస్తానని ప్రకటించడంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పై విమర్శల పర్వం మొదలు పెట్టారు.
విశాఖ గర్జన సభని డైవర్ట్ చేయడానికే పవన్ కళ్యాణ్ జనవాణి నిర్వహిస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. వెనక్కి తగ్గాలని ఒత్తిడి తెచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన జనవాణిని చెప్పిన టైంకి పెట్టాలని ఫిక్స్ అయ్యి అక్టోబర్ 15న విశాఖలో అడుగుపెట్టారు. నిజానికి పవన్ కళ్యాణ్ వచ్చే సమయానికి విశాఖ గర్జన సభ పూర్తయ్యింది. పవన్ కళ్యాణ్ పర్యటనని సీరియస్ గా తీసుకోకుండా ఎవరికి వారు వెళ్ళిపోయి ఉంటే సరిపోయేది. కాని గర్జన సభలో మంత్రి రోజా, కొడాలి నాని పవన్ కళ్యాణ్ ని లక్ష్యంగా చేసుకొని వ్యక్తిగత విమర్శలు చేశారు.
తరువాత వారు తిరిగి వెళ్ళిపోయే సమయంలో జనసేన పార్టీ కార్యకర్తలు కొంత గందరగోళం సృష్టించారు. అయితే తమ మీద వారు దాడి చేసారనే విధంగా మంత్రులు ఆ ఇష్యూని పెద్దది చేసారు. సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలతో ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా తరలివెళ్లి తన బలం చూపించే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి వైసీపీ హడావిడి మొదలుపెట్టింది. భారీ ఎత్తున పోలీసులని రంగంలోకి దించి ఆ ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంత వరకు నిలువరించగలిగారు.
తరువాత నోవోటెల్ లో జనసేన నాయకులని భారీ సంఖ్యలో అరెస్ట్ చేశారు. వారందరి మీద హత్యాయత్నం కేసులు పెట్టారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కి కూడా అరెస్ట్ చేయాలని భావించారు. అయితే ఎందుకనో మరల వెనక్కి తగ్గారు. ఆ రాత్రి మొత్తం వైసీపీ తన అధికార బలంతో జనసేనాని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. ఇక పవన్ కళ్యాణ్ కూడా దీనిని ఒక అవకాశంగా తీసుకొని తనదైన శైలిలో రాజకీయం మొదలు పెట్టారు. ఆ ప్రజా సమస్యలు తెసులుకోవడానికి వస్తే బలవంతంగా నిర్బంధించి స్వేచ్చని హరించే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తుందని ప్రాజెక్ట్ చేశారు.
మీడియా కవరేజ్ కూడా గట్టిగానే దొరికింది అరెస్ట్ చేసిన జనసేన నాయకులు, కార్యకర్తలని రిలీజ్ చేసేంత వరకు వైజాగ్ విడిచి వెళ్ళేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. ఇక జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నోవోటెల్ దగ్గరకు చేరుకోవడంతో వారిని కంట్రోల్ చేయడానికి భారీగా పోలీస్ బలగాలని ప్రభుత్వం రంగంలోకి దించింది. అలాగే సాయంత్రం లోపు విశాఖ విడిచి వెళ్లాలని నోటీసులు కూడా ఇప్పించింది. అయితే నోటీసులని కూడా ఖాతరు చేయకుండా పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు విశాఖలోనే ఉన్నారు.
పార్టీకి చెందిన నాయకులని స్టేషన్ బెయిల్ మీద విడుదల చేసిన తర్వాత అక్కడి నుంచి తిరిగి విజయవాడ వచ్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో భారీగా పోలీస్ బలగాలని ప్రయోగించి జనసేనానిని వైసీపీ సర్కార్ తన అధికారం బలంతో నిర్భందించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడంతో పాటు అన్ని పార్టీల నుంచి అలాగే ప్రజల నుంచి కూడా వైసీపీ సర్కార్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. వైసీపీ నిర్వహించిన విశాఖ గర్జన సభ మీద ప్రజల దృష్టి పూర్తిగా పక్కకి పోయింది. సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా పవన్ కళ్యాణ్ ఈ మూడు రోజులు ఏపీ రాజకీయాలలో నిలిచారు.
ప్రజల నుంచి పవన్ కళ్యాణ్ కి ఒకరకమైన సానుభూతి కూడా వచ్చింది. వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడి వైసీపీ నాయకులే కావాలని చేయించుకున్నారు అనే విధంగా జనాల్లోకి వెళ్ళింది. అలాగే పవన్ కళ్యాణ్ వేసిన రాజకీయ ఉచ్చులో వైసీపీ నాయకులు చిక్కుకొని కావాల్సినంత మైలేజ్ జనసేనానికి ఇచ్చారు. ఇదే రకమైన రాజకీయ వ్యూహాలతో పవన్ కళ్యాణ్ ఎన్నికల లోపు ప్రజలోకి వెళ్లి అందరి దృష్టి తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉందనే మాట ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తుంది.
వైసీపీ సపోర్టర్స్ కి కూడా పవన్ కళ్యాణ్ పొలిటికల్ గేమ్ భాగా అర్ధం కావడంతో జనసేనాని వ్యూహాన్ని బలంగా తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి వ్యక్తిగత విమర్శలతో పాటు పాత కథలన్నీ మళ్ళీ బయటకి తీసే ప్రయత్నం చేస్తున్నారు.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.