Categories: LatestNewsPolitics

Janasena Party: ఆవిర్భావ సభలో జనసేనాని నిర్ణయం ఎలా ఉండబోతుంది?

Janasena Party: జనసేన పార్టీ ఆవిర్భవించి మార్చి 14 తో దశాబ్ద కాలం పూర్తి చేసుకోబోతుంది. ఈ పదేళ్లలో జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఎన్నికలలో పోటీ చేసింది మాత్రం ఒక్కసారే. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీ బలమైన స్థానాలలో గెలిచే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ కచ్చితంగా పొలిటికల్ కి మేకర్ గా మారే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. గత కొన్నేళ్ల నుంచి పవన్ కళ్యాణ్ తో అధికార పార్టీపై యుద్ధం ప్రకటించారు. వైసీపీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా తన రాజకీయ ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే అధికార పార్టీ మరింత పకడ్బందీగా ఎత్తులు వేసి పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదగకుండా చేయాలని భావిస్తున్నారు.

కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన కార్యక్రమాలతో బలంగా ప్రజల్లోకి వెళ్లిపోయారు. అయితే ఎన్నికలలో పోటీపై అతను తీసుకునే నిర్ణయం పైన, వ్యూహాత్మక విధానాలపైన కొంత గందరగోళం ఉందనే మాట రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఖచ్చితమైన నిర్ణయంతో ప్రజల్లోకి వెళ్ళగలిగితే కచ్చితంగా జనసేనకి మంచి భవిష్యత్తు ఉంటుందని బలంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం వేదిక ఈసారి జనసేన ఆవిర్భావ సభ జరగబోతుంది. మార్చి 14న ఈ ఆవిర్భావ సభ నిర్వహించబోతున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఇక ఈ సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఏం చెబుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. పొత్తుల పైన అలాగే రాజకీయ కార్యాచరణ పైన ఎలాంటి ప్రకటన చేస్తారనేది అందరూ వేచి చూస్తున్నారు.

ఎప్పటిలాగే కేవలం అధికార పార్టీ మీద విమర్శలకే ఈ ఆవిర్భావ సభను కూడా పవన్ కళ్యాణ్ పరిమితం చేస్తారా లేదంటే 2024 కు సంబంధించి ఎన్నికల కార్యాచరణ ప్రకటిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంశంగా మారింది. ఇక మార్చి 14న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటనలపై ప్రజలు కూడా దృష్టిపెట్టారు. అయితే జనసేన నాయకులు టీడీపీతో పొత్తు ఉండదు అని చెప్తున్నారు. టీడీపీ పవన్ కళ్యాణ్ తమతోనే ఉన్నాడని ప్రచారం చేసుకుంటుంది. వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు దత్త పుత్రుడు అంటుంది. ఇలా ఎన్ని రకాల ఊహాగానాల మధ్య పవన్ కళ్యాణ్ చేసే ప్రకటన, తీసుకునే నిర్ణయం భవిష్యత్తు రాజకీయాలపై కచ్చితమైన ప్రభావాన్ని మాత్రం చూపిస్తాయనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

Varalakshmi

Recent Posts

Virinchi Varma: ‘జితేందర్ రెడ్డి’ సినిమా అందుకే చేశాను..

Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…

5 days ago

Raashii Khanna: అది నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..?

Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…

2 weeks ago

Tollywood: కాంబో ఫిక్స్..కానీ కథే కుదరలా..?

Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…

2 weeks ago

SSMB29: జనవరి నుంచి వచేస్తున్నాం..

SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…

2 weeks ago

The Raja Saab: ప్రభాస్ లుక్ చూస్తే రజినీకాంత్ గుర్తొస్తున్నారా..?

The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…

2 weeks ago

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ..

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…

2 weeks ago

This website uses cookies.