Janasena Party: ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక నిర్ణయాలు ఆ పార్టీ ఎదుగుదలకి ఆటంకం కలిగిస్తున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తుంది. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ పార్టీని నడిపించడంలో ఎందుకనో ఓ రకమైన భయంతోనే వెళ్తున్నారు. సంస్థాగతంగా నిర్మాణం చేసుకోకుండా కేవలం జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపించేలా చేసుకున్నారు. గ్రౌండ్ లెవల్ లో నాయకత్వాన్ని తయారు చేసే పనిపై అస్సలు దృష్టి పెట్టలేదు అనేది రాజకీయ విశ్లేషకులు పదే పదే చేసే విమర్శలు. సుదీర్ఘ రాజకీయ లక్ష్యాలు పెట్టుకున్నా కూడా ప్రజలలోకి బలంగా వెళ్లి. పార్టీకి గ్రౌండ్ లెవల్ లోకి బలంగా తీసుకెళ్ళే నాయకులని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
తెలుగుదేశం పార్టీ బలంగా నిలబడింది అంటే అ రోజు ఎన్టీఆర్ ముందుగా నియోజకవర్గాల వారీగా బలమైన నాయకులని తయారు చేసుకొని వారిని తెలుగుదేశం ప్రతినిధులుగా ప్రజలలోకి తీసుకెళ్ళారు. అలా వారికి కూడా గుర్తింపు ఇవ్వడం ద్వారా ఆ ఎన్నికలలో ప్రజలు ఎన్టీఆర్ చరిష్మాతో పాటు స్థానిక నాయకులని చూసి ఓట్లు వేసి అఖండ మెజారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో ఆ నాయకత్వం శూన్యత మాత్రం పదేళ్ళు అయినా ఇంకా ఉంది. నియోజకవర్గాలలో ఉన్న నాయకులని తాను ముందు నిలబడి ప్రజలకి పరిచయం చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. ఒక వేళ నాయకుడిని పరిచయం చేస్తే వారు తరువాత అమ్ముడుపోతారని, లేదంటే ప్రస్తుతం అక్కడ పాతుకుపోయిన నాయకుల బెదిరింపులకి భయపడపోతారని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు.
అయితే ప్రజలని ఆకర్షించాలంటే కేవలం పవన్ కళ్యాణ్ అనే ఫ్యాక్టర్ ఉంటే సరిపోదు. ఆ పవన్ కళ్యాణ్ వెనుక నిలబడే సైన్యం బలంగా కనిపించాలి. కాని అలా కనిపించడం లేదు.పోనీ ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులు పార్టీలోకి వస్తామని చెబుతున్నా వారి ఎంట్రీ కి పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడం లేదు అనేది రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. గత ఎన్నికలలో చాలా మంది కాపు నాయకులు పవన్ కళ్యాణ్ తో చర్చించి కూడా ఆ పార్టీలోకి వెళ్ళకుండా ఆగిపోయారు. ఇప్పుడు మరోసారి అలాంటి తప్పిదమే పవన్ కళ్యాణ్ చేస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పాత నాయకులకి స్థానం లేదు. కొత్త నాయకత్వం తయారు కాలేదు. ఇప్పుడు జనసేనాని ప్రయాణం ఎలా ఉంటుంది అనేది చాలా మంది ప్రశ్న
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.