Flashback: రణబీర్ కపూర్, అలియా భట్ కాంబినేషన్లో కరణ్ జోహార్ నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వం పాన్ ఇండియా మూవీగా బ్రహ్మాస్త్రం బాలీవుడ్లో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణంలో హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ వాల్ట్ డిస్నీ కూడా భాగస్వామ్యం అయ్యింది. సుమారు మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. మైథలాజికల్ కథాంశానికి ఫిక్షన్ జోడించి ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ శివుడి అంశగా కనిపించబోతున్నాడు. త్వరలో ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.
ఇదిలా ఉంటే ఇదే టైటిల్ తో 15 ఏళ్ల క్రితం తెలుగులో ఒక మూవీ వచ్చిన విషయం చాలా మందికి తెలియదు. జగపతిబాబు హీరోగా సూర్యకిరణ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నూకారపు సూర్యప్రకాశ రావు అప్పట్లో భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాని కూడా నిర్మించారు. నేహా ఒబెరాయ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆశిష్ విద్యార్థి మెయిన్ విలన్ గా చేశారు. అయితే ఊహించని విధంగా ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి జగపతి బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే మెయిన్ విలన్ దగ్గర జగపతిబాబు పని చేస్తుంటారు. జగపతిబాబు మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిగా, విలన్ ఎవరిని చంపమని చెప్తే వాళ్ళని చంపేసి క్రూరమైన వ్యక్తిగా ఉంటాడు. అలాంటి వ్యక్తి జీవితంలోకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి అతని ఒక సాధారణ మనిషిగా మారుస్తుంది. దాంతో చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనలు తనకు గుర్తు వస్తాయి. ఒక విలన్ తన తల్లిని చంపేసి తండ్రిని హత్య నేరంలో జైలుకు పంపిస్తాడు. తన తల్లిని చంపిన వాడిని చంపాలని ప్రతీకారంతో ఆమె తాళిబొట్టుని హీరో జగపతిబాబు తన చేతికి చిన్న వయసులోనే కట్టుకుంటారు. ఇక చివరిగా తనని పెంచి పెద్ద చేసిన విలన్ తన తల్లిని చంపిన వాడని తెలుసుకొని అతని జగపతి బాబు చంపేస్తాడు.
ఒక రోటీన్ కథాంశంతో యాక్షన్ అండ్ లవ్ డ్రామాగా ఈ సినిమాని దర్శకుడు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అయితే కథాంశం ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో, గతంలో వచ్చిన రాజశేఖర్ సినిమాని ఈ బ్రహ్మాస్త్రం మూవీ కూడా పోలి ఉండటంతో ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా కనీసం వారం రోజులు కూడా థియేటర్లలో ఆడకుండానే తీసేయాల్సి వచ్చింది. ఇక దర్శకుడు సూర్య కిరణ్ కి కూడా ఈ సినిమా కెరియర్ లో ఊహించని చేదు అనుభవాన్ని మిగిల్చింది. అతని కెరీర్ కి పుల్ స్టాప్ పడటానికి కారణం అయ్యింది. ఇక నిర్మాత నూకారపు సూర్యప్రకాష్ రావుకి కూడా భారీ నష్టాలని ఈ మూవీ మిగిల్చింది. మరి అదే టైటిల్ తో వస్తున్న పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.