Politics: 2024లో కూడా ఎట్టి పరిస్థితిలో అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ దానికి తగ్గ కార్యాచరణ ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. సంక్షేమ పథకాలే ఈ సారి వైసీపీకి మళ్ళీ అధికారం తీసుకోస్తాయమని జగన్ బలంగా నమ్ముతున్నట్లు అనిపిస్తుంది. ఎమ్మెల్యేలని నమ్మడం మానేసి పూర్తిగా తనని, తాను చేస్తున్న కార్యక్రమాలని నమ్ముకున్నారు. నెలకి కనీసం నాలుగు సార్లు ఏదో ఒక పథకం కోసం బటన్ నొక్కుతూ ప్రజల ఖాతాలో డబ్బులు వేస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికలకి మరో ఏడాదిన్నర సమయం ఉన్న నేపధ్యంలో సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు ఏ స్థాయిలో లబ్ది పొందుతున్నారు అనేది జనాల్లోకి బలంగా తీసుకొని వెళ్ళడానికి వైసీపీ పార్టీ కోసం పనిచేసే గ్రామ సారథులని సిద్ధం చేస్తున్నారు.
అలాగే ప్రతి పంచాయితీని ఒక యూనిట్ గా చేసి మొత్తం ముగ్గురు ప్రతినిధులని బూత్ లెవల్ కమిటీలుగా ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఒక మహిళ కూడా ఉండాలని ఇప్పటికే జిల్లా, నియోజకవర్గాల ఇన్ చార్జ్ లకి అల్టిమేటం జారీ చేశారు. ఇక ఆ ముగ్గురు పరిధిలో 50 ఇళ్ళు ఉంటాయని, ఆ ఇళ్ళకి వారు ప్రతి రోజు వెళ్తూ ఆయా కుటుంబాలతో మమేకం అవుతూ సంక్షేమ పథకాలు, జగనన్న ప్రజా రంజక పాలన గురించి గొప్పగా చెప్పి వారందరిని పార్టీ ఓటుబ్యాంకుగా మార్చాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు బూట్ లెవల్ కమిటీలు ఏర్పాటు చేసే పనిలో వైసీపీ జిల్లా నాయకులు తలమునకలై ఉన్నారు. ఇదిలా ఉంటే మరో వైపు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక నుంచి ప్రజల్లోకి వెళ్లి వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలని ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. తనకున్న నివేదిక ప్రకారం 40 శాతం ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని ఆరంభంలోనే చెప్పారు.
ఇక తాజాగా మూడో సారి గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమం తీరు, అలాగే ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ కి నివేదిక అందినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో ఈ సారి కాస్తా సీరియస్ గానే అందరికి క్లాస్ పీకారు. ఏకంగా 32 మంది ఎమ్మెల్యేల మీద ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఉందని, వారందరూ వెంటనే తమ పద్ధతి మార్చుకొని ఆయా నియోజకవర్గాలలో ప్రజలకి చేరువ అవ్వాలని గట్టిగానే చెప్పారు. ఒక వేళ అలా వెళ్ళలేము అని ఎవరైనా అనుకుంటే ఇప్పుడే చెప్పాలని వారి స్థానంలో ఈ సారి మరొకరికి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని, ఇక మర్యాదగా తప్పుకున్న వారికి పార్టీలో ఇతర బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని తెలిపారు. ఏది ఏమైనా 175 సీట్లు మాత్రం ఈ సారి కచ్చితంగా రావాలని, సంక్షేమ పథకాల పట్ల ప్రజలలో మంచి స్పందన ఉందని, వాటిని ఇంకా ఎక్కువ మందికి చేరేలా చేయడంతో పాటు, మన పాలన వలన ఏ విధమైన సపోర్ట్ వారికి దొరుకుతుంది.
ఇక అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుంది అనేది కూడా తెలియజేయాలని సూచించారు. అలాగే వీటితో పాటు స్థానికంగా ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తారు అనే నమ్మకం ఎమ్మెల్యేలు అందరూ కల్పించాలని అలా అయితేనే అనుకున్న లక్ష్యం సాధ్యం అవుతుందని చెప్పారు. అయితే ఈ సారి ప్రతిపక్షాల నుంచి గట్టి పోటీ ఎదురుకాబోతున్న నేపధ్యంలో పక్కా కార్యాచరణ, వారిని దీటుగా ఎదుర్కొని ప్రజలకి చేరువ కావాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. మరి ఎమ్మెల్యేలు అందరూ జగన్ నిర్దేశించిన మార్గంలో వెళ్లి మళ్ళీ వైసీపీకి ఎంత వరకు పట్టం కడతారు అనేది ఇప్పుడు వేచి చూడాలి.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.