Jacqueline Fernandez : బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ట్రెడిషనల్ లుక్ తో అదరగొడుతోంది. తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం ఈ బ్యూటీ ధరించిన అవుట్ ఫిట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. బూడిద రంగు లెహంగా సెట్ వేసుకుని తన అందాలను ప్రదర్శిస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తోంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాక్విలిన్ తాజాగా ఈ పిక్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. లెహంగా సెట్ లో అమ్మడి అందాలు అదుర్స్ అంటూ నెట్టింట్లో ఫ్యాన్స్ లైకులు, కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకంగా ఎన్నికైన తర్వాత అదే సంవత్సరం మిస్ యూనివర్స్ పోటీలకు కూడా వెళ్ళింది. ఆ తర్వాత సిడ్నీలో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసిన జాక్వెలిన్ శ్రీలంకలో ఒక టీవీ రిపోర్టర్ గా కూడా పనిచేస్తుంది. ఈ భామ అనంతరం మోడలింగ్ వైపు తన ఇంట్రెస్ట్ చూపించింది.
బాలీవుడ్ లోనూ మంచి అవకాశాలు రావడంతో సినిమా రంగంలోనూ అడుగులు వేసింది. జాక్వెలిన్ సినిమా హీరోయిన్ గా కన్నా ప్రత్యేక గీతాల ద్వారానే పాపులారిటీని సంపాదించుకుంది. విక్రాంత్ రోనా, హౌస్ ఫుల్, బూత్ పోలీస్, బచ్చన్ పాండే, రామసేతు వంటి హిట్ సినిమాల్లోనూ కీలకపాత్రలో కనిపించి ఫ్యాన్స్ ను తన నటనతో ఇంప్రెస్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హర హర వీరమల్లు లోను ఈ అమ్మాయి ప్రత్యేక సాంగ్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఓవైపు సినిమాలు మరోవైపు స్పెషల్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ లోను నటిస్తూ తన క్రేజ్ ను కంటిన్యూ చేస్తోంది జాక్వెలిన్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతను ఫాలో అయ్యే ఈ బ్యూటీ వరుస ఫోటోషూట్లతోనూ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. తన అందాలతో అందరి చూపులు తన వైపుకు తిప్పుకుని మాయ చేస్తోంది.
తాజాగా జాక్వెలిన్ సెల్ఫీ చిత్రంలో ‘దీవానే’ అనే స్పెషల్ సాంగ్ లో అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొడుతోంది. ఈ పాటలో కొత్త లుక్‌లో స్టార్ చాలా అందంగా కనిపించింది. దీవానే’కి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫుల్ పవర్‌లో డ్యాన్స్ చేస్తున్న టీజర్ ఇప్పటికే ఇంటర్నెట్లో వైరల్ అయింది. జాక్వెలిన్ గతంలో ‘రా రా రక్కమ్మ’ వంటి పాటలలో కొన్ని అద్భుతమైన ప్రదర్శనలను అందించింది. ఈ పాట తోలు ఇండియా మొత్తం పాపులర్ కానుంది బ్యూటీ.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.