Politics: పాదయాత్రతో గెలుపు కోసం… వైఎస్ఆర్ ని ఫాలో అవుతున్న రాహుల్..

Politics: రాజకీయాలలో అన్ని పార్టీలకి వ్యూహాలు ఉంటాయి. అయితే ఎన్ని వ్యూహాలు వేసిన చివరికి ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది వారి చేతుల్లోనే ఉంది. అయితే ప్రజలని వారి మాటలతో, చేతలతో ఎవరైతే ఆకర్షిస్తారో, అలాగే ఎవరి మీద ప్రజలు నమ్మకం చూపిస్తారో కచ్చితంగా ఆ నాయకుడికి, ఆ పార్టీకి మెజారిటీ ఇచ్చి ప్రభుత్వంలో కూర్చోబెడతారు. ఇండియాలో రాజకీయాలు అంటే కోట్ల రూపాయిల ఖర్చు అని అందరూ అంటారు. ఎన్నికలు వస్తే ప్రజలకి ఓటుకి 500 నుంచి 5000 వేల వరకు ఇచ్చే రాజకీయ నాయకులు ఉంటారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ల రూపంలో, అలాగే సంక్షేమం ద్వారా వచ్చే నిధులలో మిగిలించుకొని మళ్ళీ ఖర్చు పెట్టిన సొమ్ములు మొత్తం సంపాదించుకోవచ్చు అనేది చాలా మంది ఆలోచన. అదే ఆలోచనతో రాజకీయాలు చేస్తారు.

అయిత్తే కొంత మంది మాత్రం సిద్ధాంతాలతో రాజకీయాలు చేస్తూ, ప్రజలకి సేవ చేయడమే నాయకుడిగా మన లక్ష్యం అని అనుకుంటారు. అయితే ఈ రోజుల్లో అలాంటి నాయకులు అయితే ఎవరూ లేరు. ఇక ప్రజలు కూడా అలాంటి నాయకులు వస్తారని ఆశించడం లేదు. కాని ఉన్నదాంట్లో ఎంతో కొంత మేలు చేసేవాడు అయితే చాలు అని అనుకుంటున్నారు. అలా చూస్తూనే ఓట్లు వేస్తున్నారు. అలాగే ఎన్నికల సమయంలో వారి నుంచి ఉచితంగా వచ్చే సొమ్ములు ఎందుకు వదులుకోవడం అనే కోణంలో ఆలోచించి అన్ని పార్టీలకి చెందిన నాయకుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. అయితే డబ్బులతో రాజకీయాలు నడుస్తున్న కూడా ప్రజల కష్టాలు తెలుసుకొని, వారికి దగ్గరగా వెళ్లి, వారు చెప్పే సమస్యలు వింటూ పరిష్కరిస్తామని హామీ ఇచ్చే వారికి ప్రజలు పట్టం కట్టడం గత కొన్నేళ్ళ నుంచి చూస్తున్నాం. ఈ పద్ధతి ముందుగా ఏపీలో మొదలైంది.

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి బస్సు యాత్ర ద్వారా ప్రజల మధ్యకి వెళ్లి వారి కష్టాలు విని, వారికి భరోసా ఇచ్చి ప్రజా మద్దతుతో అధికారంలోకి వచ్చారు. మొదటి ఎన్నికలలోనే ఎవరికీ సాధ్యం కాని విధంగా భారీ మెజారిటీతో ఎన్టీఆర్ కి ప్రభుత్వ పగ్గాలని ప్రజలు అప్పగించారు. తరువాత తెలుగుదేశం వెలుగులో కనుమరుగు అయిన కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవం పోశారు. పాదయాత్రతో ప్రజలలోకి వెళ్లి. వారితో మమేకమై, ప్రజలు చెప్పే విషయాలు వింటూ, వారి కష్టాలకి భరోసా ఇస్తూ రాష్ట్రం మొత్తం తిరిగారు. దాంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రజలు ప్రభుత్వ పగ్గాలు అప్పగించారు. టీడీపీని ఓడించి భారీ మెజారిటీ ఇచ్చారు. తరువాత చంద్రబాబు కూడా పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్ళారు. అలాగే 2019 ఎన్నికలకి ముందు రెండేళ్ళ నుంచి ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ప్రతి నియోజకవర్గం వెళ్ళారు. ప్రజలతో మమేకం అవుతూ వారితో కలిసిపోతూ ప్రజలకి నమ్మకం కలిగించి భారీ మెజారిటీతో ఏకంగా 154 నియోజకవర్గాలలో గెలిచి అధికారం సొంతం చేసుకున్నారు.

ఇలా తెలుగు రాష్ట్రాలలో సక్సెస్ అయిన ఈ పాదయాత్ర ఫార్ములాని, జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా ఆకళింపు చేసుకుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చూపించిన మార్గంలో రాహుల్ గాంధీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల మధ్య తిరుగుతున్నాడు. అన్ని రాష్ట్రాలలో పాదయాత్ర చేస్తున్నాడు. రానున్న ఎన్నికలలో అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రి కావడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ ఈ పాదయాత్ర చేస్తున్నాడు. తన భారత్ జోడో యాత్రతో తనపై ఉన్న పప్పు అనే ముద్రని కూడా పోగొట్టుకుంటూ మోడీ నేతృత్వంలో బలంగా ఉన్న బీజేపీతో తలపడేందుకు సిద్ధం అవుతున్నారు. మరి ఏపీలో నాయకులకి సక్సెస్ అందించిన ఈ పాదయాత్ర ఫార్ములా రాహుల్ గాంధీని ప్రధానిగా ఢిల్లీ పీఠంపై కూర్చోబెడుతుందా లేదా అనేది చూడాలి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Game Changer: రామ్ చరణ్ తప్పించుకోగలడా..?

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…

19 hours ago

Tollywood Exclusive: ప్రభాస్ ‘రాజు’ ని టచ్ చేసేదెవరు..?

Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…

3 days ago

The Rana Daggubati Show Trailer: రానా కొత్త టాక్ షో..సెలబ్రిటీలెవరంటే..

The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…

5 days ago

Bhagyashri Borse: కాస్త అటు ఇటుగా ఆ హీరోయిన్‌లాగే ఉంది..ఎవరూ గుర్తు పట్టలేదు..!

Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…

2 weeks ago

Virinchi Varma: ‘జితేందర్ రెడ్డి’ సినిమా అందుకే చేశాను..

Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…

3 weeks ago

Raashii Khanna: అది నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..?

Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…

4 weeks ago

This website uses cookies.