Lavanya Tripathi : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ, దీనిపై ఇప్పటి వరకూ సరైన స్పష్ఠత రాలేదు. ఇటీవలే మంచు వారబ్బాయి మనోజ్ భూమా మౌనిక రెడ్డిని రెండవ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దాంతో మెగా ఫ్యామిలీ హీరోలపై సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఒకవైపు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లికి సిద్ధమవుతున్నాడని టాక్ వినిపిస్తుంటే మరొకవైపు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
అయితే, టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ పెళ్లి జరగబోతుందని ఈ మధ్య బాగా వార్తలు వచ్చి నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటికే, దీనిపై లావణ్య క్లారిటీ ఇచ్చింది. అలాగే, వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ కేవలం గాసిప్స్ అని తేల్చిపారేశారు. అయినా మళ్ళీ ఇదే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి క్లారిటీ ఇచ్చింది. నేను వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నామంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని..ఇప్పటికే చాలాసార్లు క్లారిటీ ఇచ్చినా ఎందుకు ఇలాంటి పిచ్చి గాసిప్స్ రాస్తున్నారో అంటూ ఓపెన్ అయింది. మరోసారి తనకీ వరుణ్ తేజ్‌కి పెళ్లి అనేది సోషల్ మీడియాలో క్రియెట్ చేసిన వార్తే అని తేల్చేసింది. ఇక గతంలో ఇదే విషయంలో నాగబాబు కూడా ఇవన్నీ పనికిమాలిన వార్తలంటూ కొట్టిపారేశారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.