Indrani Mukerjea : ఓటీటీల్లో డాక్యుమెంటరీ సిరీస్‍లకు భారీ ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకులు వీటిని చూసేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో కొత్త కొత్త సిరీస్ లు ఓటీటీల్లో వరుసపెట్టి రిలీజ్ అవుతున్నాయి. రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి. అందులోనూ రియల్ స్టోరీస్, సెన్సేషనల్ కేసులను బేస్ చేసుకుని రిలీజ్ అయిన క్రైమ్ వెబ్ సిరీస్‍ల ఓటీటీల్లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ‘ది హంట్ ఫర్ వీరప్పన్’ ‘ది జాలీ జోసెఫ్ కేస్’ వంటి సిరీస్ లకు ఓటీటీలో వచ్చిన క్రేజ్ అందరికి తెలిసిందే. ఇప్పుడిదే జాబితాలో ‘ది ఇంద్రాణి ముఖర్జియా: బరీడ్ ట్రూత్’ వచ్చి చేరింది. ఈ సిరీస్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో పాటు రికార్డులను సృష్టిస్తోంది.
ఇండియాలో 2015లో జరిగిన షీనా బోరా హత్య కేసు పెను సంచలనాన్ని సృష్టించింది. ఈ రియల్ క్రైమ్ స్టోరీ ఇటీవల ప్రముఖ ఓటిటిలో రిలీజ్ అయ్యింది. నిజానికి కోర్టులో కేసుల వల్ల రిలీజ్ ఆలస్యమైనా ఎట్టకేలకు ఫిబ్రవరి 29వ స్ట్రీమ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళ తదితర భాషల్లోనూ ఈ క్రైమ్ స్టోరీ స్ట్రీమింగ్ జరుగుతోంది . యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ క్రైమ్ సిరీస్ కేవలం భారత్ లోనే కాదు ఆస్ట్రేలియా, కెనడా తో సహా 18 దేశాల్లో ట్రెండింగ్ లో ఉంది. నెట్‍ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్‍లో టాప్-7లో నిలిచి రికార్డ్ బ్రేక్ చేసింది. కేవలం వారంలోనే 2.2 మిలియన్లపైగా వ్యూస్ ఈ సిరీస్ కు వచ్చాయి. అదేవిధంగా 6.9 మిలియన్ వాచ్ హవర్స్ దక్కించుకుంది.
మొత్తానికి ది ఇంద్రాణి ముఖర్జీయా డాక్యుమెంటరీ సిరీస్ అంచనాలకు మించి ఓటీటీలో దూసుకెల్తోంది . షీనా బోరా డెత్ కేసులో ట్విస్టులు ఉండడం, అందుకు తగ్గట్టుగానే క్రైమ్ సిరీస్ డైరెక్ట్ చేయడంతో దీనికి భారీ వ్యూస్ వస్తున్నాయి. ఉరార్, షానా లెవీ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ మొత్తం 4 ఎపిసోడ్లు ఉంది. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాలకు పైగానే ఉంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.