Spirtual: సనాతన హిందూ ధర్మ సంబంధ ఎన్నో ఆచారాల్ని ఇప్పటికి కూడా నిత్య జీవితంలో చాలా మంది అనుసరిస్తూ ఉంటారు. హిందూ ధర్మం ప్రకారం సమస్త జీవకోటిలో దైవం ఉంటుందని ఆ మతాన్ని ఆచరించేవారు విశ్వసిస్తూ ఉంటారు. అందులో చెట్టుకి, పుట్టకి, కనిపించే రాయికి కూడా బొట్టులు పెట్టి దండం పెట్టి మొక్కుతారు. అయితే కొంత మంది దీనికి మూఢత్వం అని అంటారు. మరికొంత మంది అసలు వాటిలో కూడా హిందువులు దైవాన్ని ఎలా చూడగలుగుతున్నారు అని విమర్శలు చేస్తూ ఉంటారు.
అయితే ఈ ప్రపంచంలో ప్రకృతి సిద్ధంగా లభించిన ప్రతిదీ మన జీవితంలో ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. మన అవసరాలని తీరుస్తుంది. ఈ కారణంగానే వాటికి దైవత్వాన్ని ఆపాదించి హిందువులు వాటిని పూజిస్తారు. అలాగే పంచ భూతాలైన గాలి, నీరు, నిప్పు, మట్టి, ఆకాశం ని కూడా దైవం గా హిందువులు భావిస్తారు. ఈ కారణంగానే ఏ మతంలో లేనన్ని విశ్వాసాలు, ఆచారాలు, నమ్మకాలు హిందూమతంలో కనిపిస్తాయి. అందులో ఒకటి గృహ ప్రవేశం సమయంలో గోవుని ఇంట్లోకి తీసుకురావడం కూడా ఒకటి.
దీనిని ఇప్పటికి కూడా కొత్త ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరు ఆచరిస్తారు. అయితే ఆ ఆచారం వెనుక బలమైన నమ్మకం ఉంది. హిందువులు ఎంత మంది అయితే దేవుళ్ళని పూజిస్తారో అంత మంది గోవులో కొలువై ఉంటారని మన పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. సకల దేవతలకి ఆవాసం కలిగించినందుకు గోవుని గోమాత అని కూడా భావించి హిందువులు పూజిస్తారు. గోవుని కొత్త ఇంట్లోకి తీసుకొస్తే సకల దేవతలని గృహంలోకి ఆహ్వానించినట్లు అవుతుందని బలంగా నమ్ముతారు. ఈ కారణంగా కొత్త ఇల్లు కట్టి గృహప్రవేశం చేసినపుడు గోమాతని కచ్చితంగా ఇంట్లోకి తీసుకొచ్చి గోమూత్రం వేసిన, గోపేడ వేసిన దానిని ఎంతో అదృష్టంగా భావిస్తారు.
అయితే ప్రస్తుతం సిటీలకి చాలా మంది వెళ్ళిపోయి అపార్ట్మెంట్ కల్చర్ కి అలవాటు పడ్డారు. అయితే అలాంటి సమయంలో కూడా అపార్ట్మెంట్ పరిసరాల్లోకి గోవుని తీసుకొచ్చి పూజ చేయడం ద్వారా ఇంట్లోకి తీసుకొచ్చిన ఫలితం కలుగుతుందని చెబుతూ ఉంటారు. హిందువులు గోమాతని పూజించడం, గోమాతని గృహప్రవేశంలో ఇంట్లో అడుగుపెట్టించడం వెనుక ఇంత కథ ఉందని ప్రస్తుత కాలంలో చాలా తక్కువ మందికి తెలుసు.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.