Ileana D’Cruz : గోవా బ్యూటీ ఇలియానా ఈ మధ్యనే తల్లి అయ్యింది. తల్లి అయినప్పటి నుంచి తన బేబీ కి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. సినిమాలకు దూరంగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇంటికే పరిమితం అయిన ఈ బ్యూటీ వీలు చిక్కినప్పుడల్లా ముచ్చటిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మళ్లీ తెరముందుకు వచ్చే ప్లాన్ చేస్తోంది. మళ్లీ వెండి తెరమీద తళుక్కుమనేందుకు తహతలాడుతోంది.
త్వరలోనే ఇల్లీబేబి తెరపై సందడి చేస్తానని సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. ఈ మేరకు ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు కూల్ గా సమాధానాలు ఇస్తూ వస్తోంది. ఓ నేటిజన్ మీరు సింగిల్ పేరెంట్ నా? మీ బేబీని ఎలా చూసుకుంటున్నారు?అని అడిగారు.ఈ క్వశ్చన్ కి ‘నేను సింగిల్ పేరెంట్ కాదు’ అంటూ తన జీవితభాగస్వామి ఫోటోను ఛానళ్ళ తర్వాత షేర్ చేసింది ఇల్లీబేబీ.
గత ఏడాది నేను ప్రెగ్నెంట్ అంటూ ఇలియానా చెప్పుకొచ్చింది . “తల్లి కాబోతున్నా. ఈ క్షణాలు ఎంతో భావోద్వేగంతో కూడుకున్నవి. ఈ అనుభూతి నాకు తెలుస్తుంది. కానీ దానిని మాటల్లో చెప్పలేను. ప్రెగ్నెంట్ అయిన నాటి నుంచి డెలీవరి వరకు అమ్మ నా పక్కనే ఉన్నారు. అందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నా. తొలిసారి బాబుని చూసిన క్షణాలు ఎంతో మధురమైనవి. బేబీ డాడీ విషయంలోనూ నేను చాలా సంతోషంగా ఉన్నాను”అని తెలిపింది.
మొదటి నుండి తన వ్యక్తిగత జీవితం గురించి ఇలియానా పెదవి విప్పలేదు. మొట్టమొదటి సారిగా ఇలియానా తన భాగస్వామితో డేట్ నైట్ నుండి చిత్రాలను పంచుకుంది. ఇలియానా అందమైన స్ట్రాపీ ఎరుపు రంగు దుస్తులు ధరించి కనిపించింది, అయితే ఆమె భాగస్వామి డేట్ నైట్ కోసం బ్లాక్ షర్ట్, ప్యాంటును ఎంచుకున్నాడు.
కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా డేటింగ్ చేస్తున్నట్లు గతంలో పుకార్లు వచ్చాయి. వీరిద్దరూ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌లతో కలిసి మాల్దీవులలో సెలవులో కనిపించిన తర్వాత, ఈ జంటపై రూమర్స్ వెల్లువెత్తాయి. ఈ ఫోటోతో ఎన్నాళ్లుగా ఉన్న సీక్రెట్ కాస్త ఓపెన్ అయిపోయింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.