Ugadi: తెలుగువారి సంవత్సరాది ఉగాది పండుగ. ప్రతీ ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకుంటాం. ఈ ఏడాది ఉగాది పండుగ ఏప్రిల్ 9వ తేదీ అంటే మంగళవారం వచ్చింది. ఉగాది పండుగ అంటే ప్రకృతి.. పచ్చదనం. అయితే కొత్త సంవత్సరాది ఉగాది పండుగ రోజు చాలా మంది తెలిసీ తెలియక చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఉగాది రోజు ఖచ్చితంగా కొన్ని రకాల పనులు చేయాలట. ఈ పనులు కనుక చేస్తే ఏడాది మొత్తం ఎంతో సంతోషంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. మరి ఉగాది రోజు ఏ పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదనే విషయానికి వస్తే..
ఉగాది పండుగ రోజు ఉదయం లేచి తలంటూ స్నానం చేసి మీ కుల దైవాన్ని ఆరాధించాలి అంతేకాకుండా ఉగాది పండుగ రోజు ఎంతో ప్రత్యేకంగా నిలిచే ఉగాది పచ్చడిని తయారు చేసి దేవదేవతలకు నైవేద్యంగా సమర్పించి అనంతరం ఈ పచ్చడిని ప్రసాదంగా ప్రతి ఒక్కరు స్వీకరించాలి. తప్పనిసరిగా ఆలయాలకు వెళ్లి దేవదేవతలను దర్శించుకోవాలి అనంతరం సాయంత్రం పంచాంగం తప్పనిసరిగా వినాల్సి ఉంటుంది. ఇక ఉగాది పండుగ రోజు మీ స్థాయికి అనుగుణంగా అన్నదానం వస్త్రదానం వంటివి చేయటం వల్ల ఎంతో శుభ ఫలితాలను పొందవచ్చు.
ఇక ఉగాది పండుగ రోజు కొన్ని రకాల పనులను అస్సలు చేయకూడదు. పండుగ రోజు పొద్దుపోయే వరకు నిద్రపోకూడదు ఎవరిని దుర్భాషలాడకూడదు. అలాగే ఇంటికి పదునైన వస్తువులను కొనుగోలు చేసి తీసుకురాకూడదు. ఇక చిరిగిపోయిన మాసిపోయిన దుస్తులను ధరించకూడదు ఇక మద్యం మాంసం వంటి పదార్థాలకు కూడా దూరంగా ఉండటం ఎంతో మంచిది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.