Health: ప్రస్తుతం దైనందిన జీవితంలో మన రోజువారి ఆహారపు అలవాట్లు, జీవన పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. సంపాదన ద్యాసలో పరుగులు పెడుతూ దైనందిన జీవితంలో చాలా అలవాట్లని క్రమమైన పద్ధతిలో నిర్వహించకుండా ఎక్కువ మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. అలాగే ఆహారపు అలవాట్లు కూడా మన జీవన ప్రమాణాలని ప్రభావితం చేస్తాయి. చిన్న వయస్సులోనే అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అలాగే శరీరంలో అసంకల్పిత పెరుగుదల కనిపిస్తుంది. తినే ఆహారపు అలవాట్ల కారణంగా ఉబకాయం వస్తుంది. అలాగే సరైన నిద్రపోకుండా రాత్రి సమయాలలో కూడా పనులు చేసే వారు ఉన్నారు.
అలాగే ఎక్కువగా టెన్షన్ తో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలాగే డిప్రెషన్ సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఇవన్ని కూడా వేగంగా శరీరాన్ని వృద్ధాప్యంలోకి తీసుకొని పోవడంతో అనారోగ్య సమస్యలు తీసుకొచ్చి శారీరకంగా బలహీనంగా మారడానికి కారణం అవుతాయి. దీంతో దీర్ఘకాలిక ఆయుస్సు క్రమంగా తగ్గిపోతుంది. దీంతో వందేళ్ళు బ్రతకాల్సిన వారు తక్కువ వయస్సులోనే మృతి చెందుతున్నారు. అయితే దీర్ఘకాలిక ఆయుష్షుని కలిగి ఉండాలంటే మాత్రం కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలని హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేస్తున్నారు.
వారు చేసిన అధ్యయనంలో ఎక్కువ కాలం బతకడానికి ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాన్ని తెలియజేశారు. శరీరంలో విటమిన్ డి లోపం ఉన్నవారు వెంటనే దీనిని పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. విటమిన్ డి లోపం వలన కండరాల బలహీనత, ఎముకలు పటుత్వం కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి. విటమిన్ డి సమృద్ధిగా లభించి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండొచ్చని చెబుతున్నారు. ఇక పాజిటివ్ ఆలోచనలని పెంపొందించుకోవాలని సూచిస్తున్నారు.
ఎలాంటి సమయంలో అయిన పాజిటివ్ గా ఆలోచించడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు. ఈ ఆలోచనలు మనల్ని అనవసరమైన డిప్రెషన్ కి గురికాకుండా ఆపుతాయి. అలాగే మానసికంగా బలంగా ఉండగలం. అలాగే సోషల్ మీడియాలో వెచ్చించే సమయాన్ని తగ్గించుకోవాలి. ఎక్కువ స్క్రీన్ సమయంతో నిద్ర సమయం తగ్గిపోతుంది. నిద్ర సమయం తగ్గితే శరీరంలో ఒత్తిడి పెరిగి వృద్ధాప్య చాయలు ముఖంలోకి వస్తాయి. పుట్టగొడుగులలో ఉండే విటమిన్ డి, సెలీనియం, ఎర్గోథియోనిన్ గ్లూటాతియోన్ వంటివి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.
అలాగే ప్రతి రోజు కనీసం 7 నుంచి 9 గంటల `సమయం కచ్చితంగా నిద్ర పోవాలి. నిద్రలేమి కారణంగానే శరీర జీవక్రియలలో సమతౌల్యం దెబ్బతిని అనారోగ్య సమస్యలు అన్ని వస్తాయి. అలాగే మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది అని నిపుణులు చెబుతున్నారు. అందుకే కచ్చితంగా 7 గంటలకి పైగా నిద్ర ఉండాలని చెబుతున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.