Health Issues: ప్రస్తుత కాలంలో చాలామంది వర్క్ ఫ్రం హోం విధులను నిర్వహిస్తూ ఇంటికి పరిమితమవుతున్నారు. అయితే చాలామంది వారి పని నిమిత్తం ఎక్కువగా కూర్చుని పనులు చేయడం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. దాదాపు 10 గంటలపాటు ఒకే చోట స్థిరంగా కూర్చుని పని చేస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాము. ఇలా ఒకే చోట కూర్చుని పని చేయటం వల్ల ఎన్నో రకాల సమస్యలు కలుగుతాయని మీరు ప్రమాదంలో పడపోతున్నారని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఎక్కువ సేపు ఒకే చోట కూర్చుని పనిచేయడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనే విషయానికి వస్తే… కదలకుండా ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని పని చేయటం వల్ల మన మెదడుకు సరైన స్థాయిలో రక్తప్రసరణ జరగక అధిక ఒత్తిడికి గురి కావలసి ఉంటుంది. ఓకే చోట కదలకుండా కూర్చుని పనిచేయడం వల్ల పని మీద ఏకాగ్రత తగ్గడమే కాకుండా, మానసికంగా అలసటకు కూడా గురవుతాము. ఇలా తరచూ పని చేయటం వల్ల కొన్ని సార్లు డిప్రెషన్ కి కూడా గురి అయ్యే అవకాశాలు ఉంటాయి.
ఒకే చోట ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులతోపాటు వెన్నునొప్పి మెడనొప్పి వంటి వ్యాధులు కూడా అధికమవుతాయి అందుకే గంటల తరబడి కూర్చోకుండా గంటకు 10 నిమిషాలు అయినా విరామం ఇచ్చి అటు ఇటు తిరుగుతూ పని చేయటం వల్ల ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులనుంచి బయట పడవచ్చు. ఇక ఎక్కువసేపు లాప్టాప్ లేదా సిస్టం ముందు కూర్చుని పని చేయటం వల్ల కంటి చూపుపై కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడే పరిస్థితులు ఉంటాయి కనుక వీలైనంతవరకు గంటకు కొన్ని నిమిషాల పాటు విరామం తీసుకోవడం ఎంతో ఉత్తమం.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.