Horoscope : ఈ వారం 02-04-2023 – 03-04-2023 వరకు 12 రాశులలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది. ఎవరికి ఈ వారం కలిసి వస్తుంది. ఎవరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ఎలాంటి కార్యక్రమాలు చేప్పటవచ్చు వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
మేషం :
ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అన్ని పనుల్లోనూ ఆశించిన ఫలితాలను పొందవచ్చు. నిజాయితీ మమ్మల్ని కాపాడుతుంది ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది. మీ పని తిరితో మీ పై అధికారుల మనసును గెలుచుకుంటారు. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. శత్రువులను జయిస్తారు. ఇంటి నిర్మాణ పనులు కూడా ప్రారంభిస్తారు. సూర్య ధ్యానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.
వృషభం :
మీ అభివృద్ధికి తోడ్పడే పనిని మీరు ప్రారంభిస్తారు. ఏకాగ్రతతో చేసే పని సత్ఫలితాలను అందిస్తుంది. చేసే ప్రతి పని పైన అవగాహన పెంచుకునే ముందుకు అడుగు వేయాల్సిన అవసరం ఉంది. వృత్తి వ్యాపారంలో జాగ్రత్తలు తప్పనిసరి కీలకమైన విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి తొందరపాటుతనం పనికిరాదు. కొన్ని కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు తీసుకోవాలి. జాగ్రత్త వ్యవహరించండి. స్థిరమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళండి శానీశ్వరుడిని ధ్యాణించడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు.
మిథునం :
ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఈ వారం మీరు చేపట్టే పనులు అన్నిటిని కూడా సత్ఫలితాలను పొందుతారు. సహాయం చేసేవారు ఉన్నారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం మధ్యలో రాశి వారికి ధన లాభం ఉంది. శుభవార్తలు కూడా వింటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ మిత్రుల నుంచి మీకు బలం అందుతుంది. ఓ విషయం మిమ్మల్ని సంతోషానికి గురిచేస్తుంది. బంధుమిత్రులతో ఈరోజు ఆహ్లాదంగా గడుపుతారు. లక్ష్మీదేవిని ధ్యాణించడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు.
కర్కాటకం :
ఈ వారం రాశి వారికి అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగస్తులకు చాలా సానుకూలంగా ఉంది. అన్ని రంగాల్లో వీరు విజయాలను సాధిస్తారు. మనుబలంతో ముందుకు సాగుతారు. కొత్త పనులను చేపడతారు. లక్ష్యం నెరవేరడంతో పాటు కుటుంబ అభివృద్ధి కనిపిస్తోంది. భూ గృహ లాభాలు ఉన్నాయి.ఓ వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో మీరు సంతోషంగా గడుపుతారు. నవగ్రహారాధన వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు.
సింహం :
పట్టుదలతో పని చేసే వారికి శుభాలు కనిపిస్తున్న ఏకాగ్రతతో విజయం సిద్ధిస్తుంది. ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయానికి తగ్గ వ్యయం కనిపిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంది. దైవబలంతో మంచి విజయాలను సొంతం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది కొన్ని కీలకమైన విషయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు అవసరం. ఈశ్వరుడిని ధ్యాణించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
కన్య :
పట్టుదలతో మీ లక్ష్యాలను పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. మంచితనంతో చేసే పనిలో విజయం సిద్ధిస్తుంది. కొన్ని కీలకమైన విషయాల్లో వీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ధర్మ మార్గంలో ప్రయాణించండి. బంధుమిత్రులను కలుపుకుపోవండి. కీలకమైన విషయాల్లో పెద్దలు సూచనలను తీసుకోండి. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆదిత్య ధ్యానం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చు.
తుల :
మనోబలంతో మీ లక్ష్యాలను చేరుకుంటారు కొన్ని కీలకమైన విషయాల్లో మీ తోటి వారి సలహాలు ఉపకరిస్తాయి. మనస్థాపానికి గురి చేసే విషయాలకు చాలావరకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పై నిర్లక్ష్యం పనికిరాదు. మొహమాటానికి వెళ్తే ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కీలకమైన విషయాలను మీ బుద్ధి బలంతో పూర్తి చేస్తారు . నవగ్రహాల సందర్శన వల్ల ఉత్తమ ఫలితాలు పొదవచ్చు.
వృశ్చికం :
ఈ వారం ఈ రాశి వారికి చాలా శుభదాయకంగా ఉంది. చేపట్టే పనుల్లో విజయాలను సొంతం చేసుకుంటారు. ఓ ముఖ్యమైన పనిలో పెద్దల సహకారం ఉంటుంది. ఆర్ధిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడుపుతారు ఓ వార్త మీకు సంతోషాన్ని అందిస్తుంది వారం మధ్యలో శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్యాన్ని ధ్యాణించడం వల్ల శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి.
ధనుస్సు :
ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. పట్టుదలతో మీరు చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. పెద్దల నుంచి ప్రశంసలు పొందుతారు. మీ పని తిరుకుగాను మిమ్మల్ని సత్కారం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఓ శుభవార్త మీకు మీ కుటుంబానికి సంతోషాన్ని అందిస్తుంది. బంధు మిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో చేసే చర్చలు ఫలిస్తాయి. ఇష్ట దైవారాధన లాభదాయకం.
మకరం :
ఈ వారం మీ రాశి వారికి చాలా దివ్యంగా ఉంది. ఈ వారం చేపట్టే పనిలో మీరు విజయాలను సొంతం చేసుకుంటారు. మీ లక్ష్యాన్ని నెరవేర్చే సమయంలో చిన్నచిన్న ఆటంకాలు ఏర్పడతాయి అయినప్పటికీ మీరు ఏమాత్రం ఇబ్బంది గురికాకండి. చివరగా మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో మీరు ఈరోజు ఉత్సాహంగా గడుపుతారు. మీ పని తీరుకు గాను ప్రశంసలు పొందుతారు. లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మేలైన ఫలితాలు గోచరిస్తున్నాయి.
కుంభం :
ఈ రాశి వారికి ఈ వారం అదృష్టం కలిసి వస్తోంది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేపట్టే పనిలో ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. మీ ప్రయత్నాలను పట్టుదలతో పూర్తి చేయాలి. ఈరోజు మీరు శుభవార్తను వింటారు. శత్రువులతో ఆచితూచి వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అదే విధంగా కీలకమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు అవసరం.సూర్యుడిని ధ్యాణించడం వల్ల మేలైన ఫలితాలు పొందవచ్చు.
మీనం :
ఈ రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది ఈ వారంలో ఓ శుభవార్తను వింటారు. ఆ శుభవార్త మీ ఇంటిలిపాదికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి కనిపిస్తోంది. గొప్ప భవిష్యత్తు కోసం మీరు ముందుగానే ఆలోచనలు చేస్తారు. మీ కుటుంబానికి ఇది శుభకాలం. ఇలాంటి శుభకాలం మళ్లీ ఎప్పుడు రాదు అని గుర్తుంచుకోవాలి. అవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి. సూర్యుని ధ్యానించడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.