Honey Rose : మలయాళంలో పాపులర్ యాక్ట్రెస్ అయిన హనీరోజ్ ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన హనీరోజ్ ఈ ఒక్క సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అమ్మడు తెలుగులో వరుసగా స్క్రిప్టులు వింటోంది. సీనియర్ హీరోలకి హనీరోజ్ మంచి ఛాయిస్. వీరసింహారెడ్డి సినిమాతో వచ్చిన క్రేజ్‌ను బాగా వాడుకోవాలనుకుంటోంది. అందుకే, ఇక్కడ పెద్ద పెద్ద బ్యానర్స్ చుట్టూ తిరుగుతుందని టాక్.
అయితే, హనీరోజ్ తాజాగా మీడియా ఇంట్రాక్షన్‌లో మాట్లాడింది. ఈ సందర్భంగా అమ్మడు బాడీ షేమింగ్‌పై కామెంట్స్ చేస్తున్న వారిని ఉద్దేశించి చెప్పుకొచ్చింది. ఎప్పుడూ ఏదోరకంగా హీరోయిన్స్ మీద కామెంట్స్ చేసేవారున్నారు. ఇటీవల ఇలాంటి కామెంట్స్‌ని ఎక్కువగా చూస్తున్నానని చెప్పుకొచ్చింది. కొందరు నెటిజన్స్ అయితే చిట్ చాట్స్‌లో చాలా వల్గర్‌గా క్వశ్చన్స్ వేస్తారని..అలాంటి వాటికి సమాధానం చెప్పాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని తెలిపింది.
హీరోయిన్స్ అంటే ఎక్కువగా బాడిషేమింగ్ మీద కామెంట్స్ చేస్తారని వాపోయిన హనీరోజ్ వేరే హీరోయిన్స్ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ చూసి చాలా బాధగా అనిపిస్తుందని చెప్పుకొచ్చింది. హీరోయిన్స్ కాస్త సన్నబడినా, బొద్దుగా కనిపించినా నెటిజన్స్ రకరకాలుగా ట్రోల్స్ చేస్తుంటారని ఆవేదన వ్యక్తం చేసింది. సినీ తారల జీవితాలలో ఇలాంటివన్నీ చాలా కామన్. కానీ, కొన్ని సందర్భాలలో వ్యక్తిగత జీవితానికి సంబంధించి మానసికంగా ఇబ్బంది పెట్టేవారున్నారని తెలిపింది.
ఇక తన విషయంలో కూడా ఇలాంటి ట్రోల్స్ బాగానే ఫేస్ చేసిందని హనీరోజ్ ఆవేదన చూస్తే అర్థమవుతుందని ఆమె మాటలను బట్టే తెలుస్తోంది. ముఖ్యంగా హనీరోజ్ బ్యాక్ గురించే ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ చేసిన వారు ఉండోచ్చునని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. హనీ చాలా ముదురు భామలా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఆమె వేసుకునే కొన్ని డ్రసుల్లో బ్యాక్ మరీ ఎబ్బెట్టుగా కూడా కనిపిస్తుంది. నెటిజన్స్ కొందరు పబ్లిక్ ఫంక్షన్స్‌లో హనీ కనిపించిన సమయంలో బ్యాక్ ఫోజ్‌నే ఎక్కువగా జూమ్ చేసి వీడియోలను వదులుతూ కామెంట్స్ చేస్తున్నారు. బహుషా ఇలాంటివి హనీని బాగా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు.
Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…
Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…
Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…
Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…
Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…
This website uses cookies.