Health Tips: ఇటీవల కాలంలో మారిన మన జీవనశైలి ఆధారంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు మనం గురి అవుతూ ఉన్నాము.. ఇలా చాలామంది బాధపడే సమస్యలలో అధిక కొలెస్ట్రాల్ సమస్య ఒకటి. చెడు కొలెస్ట్రాల్ కారణంగా హై బీపీ, గుండె జబ్బులు, ఉబకాయం, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ముఖ్యంగా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థకు అంతరాయం ఏర్పడి శరీరంలోని అవయవాల పనితీరు మందగిస్తుంది. ఒక్కొక్కసారి మరణానికి కూడా దారి తీయవచ్చు. మరి కొలెస్ట్రాల్ పెరిగింది అనడానికి సంకేతంగా ఎలాంటి లక్షణాలు కనబడతాయి అనే విషయానికి వస్తే..
మొదటి సంకేతంగా మన శరీర బరువు వేగంగా పెరుగుతుంటే మన శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం కూడా ఎక్కువగా ఉందని భావించాలి. హఠాత్తుగా ఛాతిలో నొప్పి వచ్చి ఎక్కువ రోజులు ఉండడం , విపరీతంగా చెమటలు పట్టడం, చర్మం రంగు మారడం,చర్మంపై పసుపు దద్దుర్లు మచ్చలు కనిపిస్తే వెంటనే లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయడం మంచిది. ఈ పరీక్ష ద్వారా మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని తెలుసుకోవచ్చు.
చెడు కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించుకోవడానికి ఉదయం సాయంత్రం శారీరక శ్రమ కలిగిన వాకింగ్ ,రన్నింగ్ వంటివి కచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. కొవ్వు శాతం తక్కువగా ఉన్న పండ్లు ,కూరగాయలను డ్రై ఫ్రూట్స్ మన రోజువారి ఆహారంలో అలవాటు చేసుకోవాలి. పై లక్షణాల్లో ఏ ఒక్కటి ఎక్కువ రోజులు మిమ్మల్ని భావించిన వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం మంచిది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.