Cool Water: చాలామందికి తరచూ కూల్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది అందుకే కాలంతో సంబంధం లేకుండా వేసవికాలం అయిన లేదా చలికాలం అయినా కూడా ఫ్రిజ్లో నీటిని పెట్టుకుని తాగుతూ ఉంటారు. ముఖ్యంగా చలికాలంలో ఈ ఫ్రిడ్జ్ వాటర్ తాగటం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమైన విషయం అందరికీ తెలిసిందే కానీ చాలామంది కూల్ వాటర్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. చలికాలంలో కూల్ వాటర్ తాగడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనే విషయానికి వస్తే…
చలికాలం అంటేనే వాతావరణంలోని ఉష్ణోగ్రతలు కూడా పూర్తిస్థాయిలో పడిపోయి ఉంటాయి కనుక వాతావరణం కూడా చల్లబడుతుంది దీంతో బ్యాక్టీరియా పెరుగుదలకు కూడా ఎంతో అవకాశాలు ఉండటం వల్ల ఎన్నో రకాల వ్యాధులు తొందరగా వ్యాప్తి చెందడానికి కారణం అవుతాయి. ఇలాంటి తరుణంలోనే మనం నీటిని కూడా చల్లవిగా తీసుకోవడం వల్ల మన గొంతులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడానికి కారణం అవుతుంది తద్వారా గొంతు నొప్పి వచ్చే సమస్యలు అధికమవుతాయి అంతేకాకుండా మనం తీసుకున్నటువంటి ఆహారం కూడా తేలికగా జీర్ణం కాదు.
చలికాలంలో కూల్ వాటర్ అధికంగా తీసుకోవడం వల్ల గుండె పనితీరుపై కూడా అధిక ప్రభావాన్ని చూపిస్తాయి. గుండె వేగం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం, అజీర్ణం లాంటి సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే చలికాలంలో చల్లని నీటికి బదులుగా కాస్త గోరువెచ్చని నీటిని తాగటం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.