Health Tips: వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం డీహైడ్రేట్ అయ్యి వడదెబ్బకు గురువుతుంటారు. అయితే వేసవిలో డీహైడ్రేషషన్, ఇతర అనారోగ్యాల కారణంగా చాలా మందిలో మూత్రం రంగు మారుతూ ఉంటుంది. సాధారణంగా శరీరంలో వాటర్ లెవల్స్ బట్టి మూత్రం రంగు ఆధారపడి ఉంటుంది. మూత్రం రంగు మారడం కొన్ని అనారోగ్య సమస్యలను తెలిపే సంకేతం. అసలు మూత్రం ఏయే రంగుల్లో కనిపిస్తుంది, ఏ రంగు ఎలాంటి వ్యాధికి సంకేతం అనే వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా శరీరంలో హైడ్రేషన్ లెవెల్స్ సరిగ్గా ఉంటే, మూత్రం రంగు లేత పసుపు, క్లియర్ కలర్‌లో ఉంటుంది. అయితే శరీరం డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు మూత్రం ముదురు కాషాయం రంగులోకి యూరిన్ మారుతుంది. అంతే కాకుండా వాసనలో కూడా మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే మూత్రం రంగు మారటానికి అనేక కారణాలు ఉంటాయి. డిహైడ్రేషన్, టైప్ 2 డయాబెటిస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, వల్ల మూత్రం రంగులో మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని సందర్భాలలో మూత్రంలో రక్తం చీము కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.
• బ్లూ, గ్రీన్ కలర్ : మూత్రం బ్లూ, గ్రీన్ రంగుల్లో కనిపిస్తే, తినే ఆహారంలో మిథైలిన్ బ్లూ కలిసి ఉండటమే అందుకు కారణం. అంతే కాకుండా కొన్ని సందర్భాలలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మూత్రం నీలం, ఆకుపచ్చ లేదా ఊదా రంగులోకి మారే అవకాశం ఉంటుంది.
* ఆరెంజ్ కలర్ : మూత్రం ఆరెంజ్ కలర్‌లో ఉంటే, తీవ్రమైన డీహైడ్రేషన్ బారిన పడినట్లు గుర్తించాలి. అంతే కాకుండా కొన్ని సందర్భాలలో రక్తప్రవాహంలో పిత్తం చేరడం వల్ల కూడా మూత్రం ముదురు నారింజ రంగులో ఉంటుంది. అలాగే పెద్దలకు వచ్చే కామెర్లు కూడా మూత్రం నారింజ రంగులోకి మారుతుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.